PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-bjp-janasena-pawan-kalyan-kutami-ap-politics2024f10078d7-6ce6-4bb6-83ef-958331342891-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-bjp-janasena-pawan-kalyan-kutami-ap-politics2024f10078d7-6ce6-4bb6-83ef-958331342891-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికలు ఆంధ్రాలో టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగుతూ ఉండేది.. అయితే జనసేన పార్టీ కూడా అన్ని నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లి మరి పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత బిజెపితో కూడా తన సాయి శక్తుల ప్రయత్నించి కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి చేతులు జోడించి అడుక్కున్నానంటూ తెలియజేశారు. నిజానికి బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తుTDP;BJP;JANASENA;PAWAN KALYAN;KUTAMI;AP POLITICS2024{#}Telugu Desam Party;Arrest;Press;CBN;House;kalyan;Bharatiya Janata Party;Elections;YCP;Janasena;TDPఏపీ: పవన్ లేకుంటే కూటమి నడపడం సాధ్యం కాదా..?ఏపీ: పవన్ లేకుంటే కూటమి నడపడం సాధ్యం కాదా..?TDP;BJP;JANASENA;PAWAN KALYAN;KUTAMI;AP POLITICS2024{#}Telugu Desam Party;Arrest;Press;CBN;House;kalyan;Bharatiya Janata Party;Elections;YCP;Janasena;TDPThu, 02 May 2024 15:12:42 GMT2024 ఎన్నికలు ఆంధ్రాలో టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగుతూ ఉండేది.. అయితే జనసేన పార్టీ కూడా అన్ని నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లి మరి పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత బిజెపితో కూడా తన సాయి శక్తుల ప్రయత్నించి కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి చేతులు జోడించి అడుక్కున్నానంటూ తెలియజేశారు.


నిజానికి బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కలుపుకోవాలని అనుకోలేదు.. కానీ టిడిపి మాత్రం బిజెపితో పొత్తు కావాలనుకొంది. అది అసాధ్యం అనుకున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వల్లే అది సాధ్యమైనది. నిన్నటి రోజున మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా కరెక్ట్ సమయంలో సిద్ధార్థ నాథ్ సింగ్ కి కూడా మేనిఫెస్టో ఇవ్వబోతుంటే ఆయన వద్దని చెప్పారు.. అయితే దీని వెనక పరిణామాలు చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది.


టిడిపి విడుదల చేసిన మేనిఫెస్టో దాదాపుగా ఏడాదికి లక్ష 70 వేలకు పైగా కోట్ల ఖర్చు అవుతుందట. అలాగే ముస్లింలకు హాజ హౌస్ , హజ్ యాత్రకు ఖర్చులు ఇతరత్రా వాటిని కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు. అయితే ఈ విషయంలో బిజెపి పార్టీ ఏం ప్రస్తావించిందంటే.. ఈ విషయాలన్ని అధినాయకత్వ దగ్గరకి కొంతమంది రాష్ట్ర నాయకులు తీసుకువెళ్లారు. ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు పెడితే అది తమ పార్టీలకు వ్యతిరేకమవుతుందంటూ.. మరొక పాయింట్ ఏమిటంటే అలాగే అయితే అయోధ్యకు వెళ్లేటువంటి వారికోసం చార్జీలు భరించాలని.. అయోధ్యలో ఆంధ్ర భవనం నిర్మించాలని.. అలాగే అక్కడ ఉచిత వసతులు కల్పించాలని.. తిరుపతికి వెళ్లేటువంటి వారికి.. ఉచితంగా దర్శనం,ఉచితంగా ట్రాన్స్పోర్ట్ కూడా అందించాలంటూ కండిషన్ పెట్టిందట బిజెపి.. అయితే ఈ విషయంపై టిడిపి పార్టీ ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఖర్చులు ఎక్కువవుతుంది అని కూడా ఆలోచించిందట.

అలా బిజెపి టిడిపి మధ్య కాస్త తేడాలు వచ్చాయట. ఫైనల్ గా మేనిఫెస్టో దగ్గరకి రామని చెప్పిందట బిజెపి. రాకపోతే కూటమిలో వేరే సంకేతం వెళుతుందని భావించిన టిడిపి జనసేన.. చాలా ప్రెషర్ పెట్టడం కేవలం అక్కడికి వచ్చి ఉంటాము కానీ.. మేనిఫెస్టోను తీసుకోమని తెలిపారు. అందుకే అక్కడ పురందేశ్వరిని దూరం పెట్టారు బిజెపి పార్టీ. అయితే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియక టిడిపి జనసేన మేనిఫెస్టోను బిజెపికి ఇవ్వాలని చూసినప్పుడు నిరాకరించారు.. అయితే ఈ విషయం పవన్, చంద్రబాబుకి ఇద్దరికీ తెలుసట. బిజెపి ఫోటో టిడిపి మేనిఫెస్టోలో ఉండకూడదని చెప్పారట. అందుకే చివరి నిమిషంలో మూడు గంటల ఆలస్యంతో  ప్రింటింగ్ చేసి మరి ప్రెస్ మీట్ పెట్టి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సమయంలో అటు పవన్ చంద్రబాబు ముఖంలో కాస్త చిరాకు కనిపించింది. దీనివల్లే కూటమిలో లోపం కనిపిస్తోంది అంటూ వైసీపీ కూడా వీటిని వైరల్ గా చేస్తోంది. ఇక్కడ జనసేన లేకపోతే అసలు టిడిపి తో పొత్తు ఉండేది కాదని మరొకసారి క్లియర్ గా అర్థమవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>