MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manisha2916b062-5435-47e0-ac29-cb5ed34fb496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manisha2916b062-5435-47e0-ac29-cb5ed34fb496-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల పాటు హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మనిషా కోయిరాల గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. ఆ మూవీ లతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె హిందీ తో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది. అవి కూడా చాలా వరకు విజయాలను సాధించడంతో ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సంజయ్ లీmanisha{#}NET FLIX;Hindi;Tamil;Indian;Interview;BEAUTY;Telugu;Cinema;Heroineపార్ట్నర్ ఉండడం మంచిదే... కానీ అతని కోసం వెయిట్ చేయడం దండగ... మనీషా కొయిరాలా..!పార్ట్నర్ ఉండడం మంచిదే... కానీ అతని కోసం వెయిట్ చేయడం దండగ... మనీషా కొయిరాలా..!manisha{#}NET FLIX;Hindi;Tamil;Indian;Interview;BEAUTY;Telugu;Cinema;HeroineThu, 02 May 2024 13:09:27 GMTచాలా సంవత్సరాల పాటు హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మనిషా కోయిరాల గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. ఆ మూవీ లతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇకపోతే ఈమె హిందీ తో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది. అవి కూడా చాలా వరకు విజయాలను సాధించడంతో ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సిరీస్ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సిరీస్ ఈ రోజు నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మనిషా కొయిరాలా మాట్లాడుతూ ... నా జీవితంలో ఓ తోడు ఉంటే బాగుండేది అని నాకు చాలా సార్లు అనిపించింది. లైఫ్ లో ఓ భాగస్వామి ఉండడం చాలా మంచి విషయం. కాకపోతే ఆ లైఫ్ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం మాత్రం దండగ పని. మనకు రాసి పెట్టి ఉంటే మనకు ఎవరో ఒకరు వస్తారు.

ప్రస్తుతం నా జీవితాన్ని ఎంతో సంపూర్ణంగా ఆస్వాదిస్తున్న. ఇప్పటి వరకు నాకు లైఫ్ పార్ట్నర్ లేడు అనే బాధ నాకు ఏమీ లేదు అని ఈ బ్యూటీ తెలియజేసింది. ఇక 2010 వ సంవత్సరం సామ్రాట్ దహల్ అనే వ్యాపార వేత్తతో మనిషా వివాహం అయ్యింది. ఆ తర్వాత 2012 వ సంవత్సరం వీరిద్దరూ విడిపోయారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>