EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modida423d14-35b0-48da-b878-3ff22e42e68b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modida423d14-35b0-48da-b878-3ff22e42e68b-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు ఆ రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు-పవన్ లు దీనిని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కాస్తా జాగ్రత్తగా పరిశీలిస్తే… ఇది జనసేన, టీడీపీ మ్యానిఫెస్టో యే తప్ప ఎన్డీయే కూటమిది కాదు అనేది అర్థం అవుతుంది. అవును.. తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్modi{#}Siddharth;Narendra Modi;Janasena;Pawan Kalyan;TDP;Bharatiya Janata Party;CBN;Andhra Pradeshచంద్రబాబు మేనిఫెస్టో.. దీనికి మోదీ గ్యారంటీ లేదా?చంద్రబాబు మేనిఫెస్టో.. దీనికి మోదీ గ్యారంటీ లేదా?modi{#}Siddharth;Narendra Modi;Janasena;Pawan Kalyan;TDP;Bharatiya Janata Party;CBN;Andhra PradeshThu, 02 May 2024 13:00:00 GMTఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు  ఆ రెండు పార్టీల  ఉమ్మడి మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు-పవన్ లు దీనిని ఆవిష్కరించారు.


ఈ నేపథ్యంలో కాస్తా జాగ్రత్తగా పరిశీలిస్తే… ఇది జనసేన, టీడీపీ మ్యానిఫెస్టో యే తప్ప ఎన్డీయే కూటమిది కాదు అనేది అర్థం అవుతుంది.  అవును.. తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. అలా అని ఈ మ్యానిఫెస్టోకి బీజేపీ నైతిక బాధ్యత తీసుకుంటుందా అంటే అది పొరపాటయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ తాజా మ్యానిఫెస్టో విషయంలో బీజేపీ నుంచి అధికారికంగా ఏపీ ప్రజలకు ఎలాంఇ భరోసా లేదనే చర్చ తెరపైకి వచ్చింది.


ఈ మ్యానిఫెస్టో కవర్ పేజీలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా కూడా నరేంద్ర మోదీ కనిపించలేదు. ఇదే సమయంలో దీనిని విడుదల చేసేందుకు పవన్, చంద్రబాబులతో పాటు ఆ పుస్తకాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ నిరాకరించారు. ఆయనకు మ్యానిఫెస్టో ప్రతిని అందిస్తుంటే వద్దని చెప్పి వారించారు. సున్నింతగా దానిని తిరస్కరించి కాస్తా దూరం జరిగారు.


ఇది కూటమి మ్యానిఫెస్టో కాదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణే చాలు. దీనిని కవర్ చేసేందుకు చంద్రబాబు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఎన్డీయే అక్కడ మ్యానిఫెస్టో ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలోని మ్యానిఫెస్టోతో వారు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తామని ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే పెద్దన్న మోదీ గ్యారంటీ ఈ కూటమి మ్యానిఫెస్టోపై లేదు అనే విషయం స్పష్టమవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>