MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brand-allu-arjun-creating-records-for-pushpa-389dd62a-1b35-4919-8696-53b5536b7953-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brand-allu-arjun-creating-records-for-pushpa-389dd62a-1b35-4919-8696-53b5536b7953-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకొని సంచలన కలక్షన్ లను వసూలు వసూలు చేసింది. అలాగే ఇందులో అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , ఆ తర్వాత ఈ సినిమా లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా రావడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి పార్ట్ ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ aa{#}Bengali;sree;rashmika mandanna;Arjun;Allu Arjun;Kannada;Hindi;India;Sangeetha;Director;Tamil;News;Telugu;Cinemaఆ భాషలో కూడా "పుష్ప 2"..!ఆ భాషలో కూడా "పుష్ప 2"..!aa{#}Bengali;sree;rashmika mandanna;Arjun;Allu Arjun;Kannada;Hindi;India;Sangeetha;Director;Tamil;News;Telugu;CinemaThu, 02 May 2024 11:32:00 GMTఅల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకొని సంచలన కలక్షన్ లను వసూలు వసూలు చేసింది. అలాగే ఇందులో అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , ఆ తర్వాత ఈ సినిమా లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా రావడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి పార్ట్ ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ రెండవ భాగాన్ని కూడా ఈ ఐదు భాషల్లోనే విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అదనంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మరొక భాషలో కూడా విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ ని అదనంగా బెంగాలీ భాషలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇలా ఈ సినిమా ఇండియా లోనే ఆరు భాషల్లో విడుదల కానుంది. మరి ఈ సినిమాకు బెంగాలీ ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ లో రష్మిక మందన , అల్లు అర్జున్ కి జోడి గా కనిపించనుండగా ... గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... ఫాహద్ ఫాజీల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>