Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/criciket776c0eb6-2724-4077-af0e-80df864a0eb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/criciket776c0eb6-2724-4077-af0e-80df864a0eb6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఐసీసీ విధించిన డెడ్ లైన్ ప్రకారం అటు ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనబోయే 20 జట్లకు సంబంధించిన జట్ల వివరాలను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. అయితే ఈసారి వరల్డ్ కప్ టోర్ని వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే వరల్డ్ కప్ మ్యాచ్ లకి సంబంధించి ఇప్పటికే ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా ఇటీవల అన్ని దేశాల క్రికెట్Criciket{#}England;West Indies;World Cup;June;Yevaru;Cricket;Indiaటి20 వరల్డ్ కప్ లో ఇండియా ఇంటికేనట.. ఇంగ్లాండ్ మాజీ జోస్యం?టి20 వరల్డ్ కప్ లో ఇండియా ఇంటికేనట.. ఇంగ్లాండ్ మాజీ జోస్యం?Criciket{#}England;West Indies;World Cup;June;Yevaru;Cricket;IndiaThu, 02 May 2024 10:00:00 GMTప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఐసీసీ విధించిన డెడ్ లైన్ ప్రకారం అటు ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనబోయే 20 జట్లకు సంబంధించిన జట్ల వివరాలను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. అయితే ఈసారి వరల్డ్ కప్ టోర్ని వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.



ఇకపోతే వరల్డ్ కప్ మ్యాచ్ లకి సంబంధించి ఇప్పటికే ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా ఇటీవల అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించడంలో.. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఎవరు గెలుస్తారు అనే విషయంపై రివ్యూలు ఇవ్వడంలో మాజీ ఆటగాళ్లు అందరూ కూడా తెగ బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే తమ రివ్యూ లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశపరిచిన టీమిండియా.. ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో మాత్రం అదరగొట్టాలని అనుకుంటుంది. టైటిల్ గెలిచి విశ్వవిజేతగా అవతరించాలని భావిస్తుంది.


 దీంతో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. కానీ టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలవదు అంటూ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకల్ వాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. టి20 వరల్డ్ కప్ పై మైకల్ వాన్ జోస్యం చెప్పారు. మరో నెలరోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందని పరోక్షంగా సూచించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీఫైనల్ కు వెళ్తాయిఅంటూ చెప్పుకొచ్చారు. అంటే ఇన్ డైరెక్ట్ గా లీగ్ దశ నుంచి ఇండియా నిష్క్రమిస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు. అయితే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయం లో కూడా ఇలాంటి రివ్యూ ఇచ్చి నాలుక కర్చుకున్నారు మైకల్ వాన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>