Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apf3b546d2-c003-403e-9cbb-e338a6283b2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apf3b546d2-c003-403e-9cbb-e338a6283b2e-415x250-IndiaHerald.jpgఎందుకో గాని విశాఖ పార్ల‌మెంటు సీటు వార్ క్ర‌మ‌క్ర‌మంగా కూట‌మి వైపు నుంచి వైసీపీకి అనుకూలంగా మారిపోతోంది. ఇక్క‌డ కూట‌మిలో భాగంగా టీడీపీ నుంచి భ‌ర‌త్‌తో పాటు బీజేపీ నుంచి జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఇటు గ‌త ఎన్నిక‌ల్లో భారీగా ఓట్లు తెచ్చుకున్న జ‌న‌సేన కూడా పోటీ చేయాల‌ని అనుకున్నాయి. భ‌ర‌త్ చంద్ర‌బాబు ఫ్యామిలీ మ‌నిషి.. ఇటు బాల‌య్య అల్లుడు కావ‌డంతో అత‌డికే సీటిచ్చారు. గ్యారెంటీగా కూట‌మి గెలిచే పార్ల‌మెంటు సీటు అన్న మాట నుంచి నేడు గెలిస్తే గొప్పే.. చాలా టైట్ అయిపోయింద‌న్న మౌత్ టాక్‌కు భ‌ర‌త్ ప‌డిపోయాడు. Ap{#}BOTCHA SATYANARAYANA;Vishakapatnam;Car;war;District;local language;YCP;Bharatiya Janata Party;TDPవిశాఖ‌లో టీడీపీ భ‌ర‌త్ వెన‌క‌ప‌డ్డాడా... ఝాన్సీ మూడోసారి పార్ల‌మెంటు ఎంట్రీ ప‌క్కానా..?విశాఖ‌లో టీడీపీ భ‌ర‌త్ వెన‌క‌ప‌డ్డాడా... ఝాన్సీ మూడోసారి పార్ల‌మెంటు ఎంట్రీ ప‌క్కానా..?Ap{#}BOTCHA SATYANARAYANA;Vishakapatnam;Car;war;District;local language;YCP;Bharatiya Janata Party;TDPThu, 02 May 2024 09:00:00 GMTఎందుకో గాని విశాఖ పార్ల‌మెంటు సీటు వార్ క్ర‌మ‌క్ర‌మంగా కూట‌మి వైపు నుంచి వైసీపీకి అనుకూలంగా మారిపోతోంది. ఇక్క‌డ కూట‌మిలో భాగంగా టీడీపీ నుంచి భ‌ర‌త్‌తో పాటు బీజేపీ నుంచి జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఇటు గ‌త ఎన్నిక‌ల్లో భారీగా ఓట్లు తెచ్చుకున్న జ‌న‌సేన కూడా పోటీ చేయాల‌ని అనుకున్నాయి. భ‌ర‌త్ చంద్ర‌బాబు ఫ్యామిలీ మ‌నిషి.. ఇటు బాల‌య్య అల్లుడు కావ‌డంతో అత‌డికే సీటిచ్చారు. గ్యారెంటీగా కూట‌మి గెలిచే పార్ల‌మెంటు సీటు అన్న మాట నుంచి నేడు గెలిస్తే గొప్పే.. చాలా టైట్ అయిపోయింద‌న్న మౌత్ టాక్‌కు భ‌ర‌త్ ప‌డిపోయాడు.


బొత్స ఝాన్సీ పేరు విశాఖ పార్ల‌మెంటు సీటుకు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ప్పుడు అంత అంచ‌నాలు లేవు. ఇక్క‌డే బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయ చాణుక్యం స్టార్ట్ అయ్యింది. ఆయ‌న విశాఖ‌లోనే నివాసం ఉంటారు. పైగా విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల వైసీపీ అభ్య‌ర్థులు ఆయ‌న అనుంగు శిష్యులే. గ‌తంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న‌ప్పుడు వాళ్ల‌కు కావాల్సిన‌న్ని మేళ్లు చేసి పెట్ట‌డంతో పాటు విశాఖ న‌గ‌ర అభివృద్ధిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇదే ఇప్పుడు ఝాన్సీకి స్థానిక పార్టీ నేత‌ల నుంచి తిరుగులేని స‌హ‌కారం ల‌భించ‌డానికి కీల‌కంగా మారింది.


ఇక ఝాన్సీ  విశాఖ‌కు లోక‌ల్ కావ‌డం.. ఆమె ఇక్క‌డ ఆడ‌ప‌డుచు కావ‌డం కూడా ఓట‌ర్లు ఆమె వైపు ఆలోచ‌న చేసేందుకు కార‌ణ‌మైంది. ఝాన్సీ త‌న ప్ర‌చారంలో తాను ఉత్త‌రాంధ్ర వెన‌క‌బాటు త‌నం, విశాఖ అభివృద్ది గురించి తాను బొబ్బిలి, విజ‌య‌న‌గ‌రం ఎంపీగా ఉన్న‌ప్పుడే మాట్లాడిన మాట‌లు ఇప్ప‌ట‌కీ మినిట్స్ బుక్‌లో ఉన్నాయంటూ ఆధారాల‌తో స‌హా చేస్తోన్న ప్ర‌సంగాలు కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళుతున్నాయి. దీనికి తోడు పార్ల‌మెంటు ప‌రిధిలో నార్త్‌, సైత్‌, ఈస్ట్‌, వెస్ట్ నాలుగు సీట్ల‌లోనూ వైసీపీని నిలువ‌రించేందుకు టీడీపీ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించేలా క‌న‌ప‌డ‌డం లేదు. ఇక శృంగ‌వ‌ర‌పుకోట‌లోనూ వైసీపీకి ఆధిక్య‌త ఉంది.


విచిత్రం ఏంటంటే ఝాన్సీ త‌న ప్ర‌సంగాల‌తో ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోతుంటూ అటు టీడీపీ క్యాండెట్ భ‌ర‌త్ ప్ర‌సంగాలే చేయ‌ని ప‌రిస్థితి. కారు దిగ‌కుండానే.. అస‌లు ప్ర‌జ‌ల్లోకి రాకుండా చేయి ఊపుకుంటూ వెళ్లిపోవ‌డం ఒక మైన‌స్ అయితే.. భ‌ర‌త్ ప్ర‌సంగాలు ఏవి ప్ర‌జ‌ల్లో రిజిస్ట‌ర్ కావ‌ట్లేదు. ఏదేమైనా గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రంలో నాలుగు దిక్కులా నాలుగు సీట్లు టీడీపీకే ఇచ్చిన విశాఖ ఓట‌రు ఎంపీకి వ‌చ్చేస‌రికి వైసీపీకే ప‌ట్టం క‌ట్టారు. ఈ సారి కూడా అదే ప‌రిస్థితి రిపీట్ అయ్యే వాతావ‌ర‌ణ‌మే అక్క‌డ క‌నిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>