Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec04632ce-6949-4232-9153-8de6cb97b0d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec04632ce-6949-4232-9153-8de6cb97b0d9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లకు ఇటీవల అరుదైన గౌరవం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమంలో ఈమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది.గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన 'మా ఊరి పొలిమేర 2'లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాsocialstars lifestyle{#}Dadasaheb Phalke;anil music;sri vishnu;cinema theater;Capital;Lakshmi Devi;Onamalu;Santosham;Success;Darsakudu;Director;Telugu;Cinemaఉత్తమ నటీగా అరుదైన గౌరవం అందుకున్న పొలిమేర బ్యూటీ..!!ఉత్తమ నటీగా అరుదైన గౌరవం అందుకున్న పొలిమేర బ్యూటీ..!!socialstars lifestyle{#}Dadasaheb Phalke;anil music;sri vishnu;cinema theater;Capital;Lakshmi Devi;Onamalu;Santosham;Success;Darsakudu;Director;Telugu;CinemaThu, 02 May 2024 21:45:00 GMTటాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లకు ఇటీవల అరుదైన గౌరవం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమంలో ఈమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది.గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన 'మా ఊరి పొలిమేర 2'లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక కావటం విశేషం. మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలై వీక్షకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ 'పొలిమేర 2'ను థియేటర్లలో విడుదల చేశారు. అందులో లక్ష్మీ పాత్రలో కామాక్షీ భాస్కర్ల నటించారు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్ ఆమె క్యారెక్టర్ మీద ఉంటుంది. కథలో ఎంతో వెయిటేజ్ ఉన్న పాత్రలో ఆవిడ చూపించిన ఇంటెన్స్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అవార్డు కూడా వచ్చింది. దాంతో కామాక్షి సంతోషం వ్యక్తం చేశారు.ఉత్తమ నటిగా 14వ దాదా సాహేబ్ ఫాల్కే పురస్కారాల్లో అవార్డు వచ్చిన సందర్భంగా దర్శకుడు అనిల్ విశ్వనాథ్, ఇంకా చిత్ర బృంద సభ్యులకు కామాక్షీ భాస్కర్ల థాంక్స్ చెప్పారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''ఉత్తమ నటిగా నాకు ఈ అవార్డు రావటం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి స్పెషల్ థాంక్స్. 'పొలిమేర 2'లో నటనకు గాను నాకు వచ్చిన ఈ అవార్డు నటిగా నా బాధ్యత మరింత పెంచింది'' అని చెప్పారు.సమహార థియేటర్ లో నటనలో తనతో ఓనమాలు దిద్దించి, తనకు నటన నేర్పించిన గురువు రత్న శేఖర్‌, నీజర్ కబిలకు సైతం కామాక్షీ భాస్కర్ల థాంక్స్ చెప్పారు. ఇంకా సినిమాకు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలో తనకు నటన నేర్పిన గురువుగారు రత్నశేఖర్, నేజర్ కబీ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఈ ముద్దుగుమ్మ.. నా ప్రయాణంలో మీ అందరి సపోర్ట్ కు ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డ్ అంకితం ఇస్తున్న అంటూ వివరించింది.
కామాక్షి షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే డాక్టర్‌గా చదివిన పూర్తి చేసిన కామాక్షి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మిస్ తెలంగాణగా నిలిచిన కామాక్షి.. ఆ ఇమేజ్‌తోనే సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలను అందుకుంది. ఇటీవల వచ్చిన పొలిమేర సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ.. పలు అవార్డులతో పాటు వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటుంది. ఇటీవల తెరకెక్కిన శ్రీ విష్ణు మూవీ ఓం భేమ్ బుష్ లోను ఈమె మెప్పించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>