MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawandf7a2ec6-a79e-4ce6-a0f9-8b3f544ab113-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawandf7a2ec6-a79e-4ce6-a0f9-8b3f544ab113-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు అనే మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ఆగిపోయింది. ఇక ఆ గ్యాప్ లో క్రిష్ కూడా కొండపొలం అనే మూవీ ని ప్రారంభించి , పూర్తి చేశాడు. వీరిద్దరూ ఈ సినిమాలను పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ pawan{#}Nidhhi Agerwal;Thief;Donga;News;kalyan;Cinema"హరిహర వీరమల్లు" టీజర్ విడుదల... ఇదే హైలెట్..?"హరిహర వీరమల్లు" టీజర్ విడుదల... ఇదే హైలెట్..?pawan{#}Nidhhi Agerwal;Thief;Donga;News;kalyan;CinemaThu, 02 May 2024 12:19:25 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు అనే మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ఆగిపోయింది. ఇక ఆ గ్యాప్ లో క్రిష్ కూడా కొండపొలం అనే మూవీ ని ప్రారంభించి , పూర్తి చేశాడు.

వీరిద్దరూ ఈ సినిమాలను పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానితో ఈ మూవీ మొత్తానికి ఆగిపోయింది ... మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు అని వార్తలు వచ్చాయి. దీనిని మేకర్స్ కొట్టి పారేశారు. కచ్చితంగా ఈ మూవీ విడుదల అవుతోంది అని చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు.

సినిమా టీజర్ లో పేద ప్రజలను కొంత మంది బలవంతులు దోచుకుంటూ ఉంటారు. ఇక పేద ప్రజలను కొంత మంది బలవంతులు దోచుకుంటే ఆ బలవంతులను దోచుకునే వాడు ఒకడు ఉంటాడు అనే వ్యాఖ్యలతో టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ని చూపించారు. ఇకపోతే పవన్ ఈ సినిమాలో బలవంతుల దగ్గర నుండి ధనాన్ని దోచుకునే బంది పోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటి వరకు పవన్ ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలో కనిపించకపోవడంతో ఈ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను ఈ సంవత్సరమే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే క్రిష్ ఈ సినిమా దర్శకత్వం నుండి తొలగిపోయినట్లు వేరే కొత్త దర్శకుడితో ఈ సినిమా మిగిలిన భాగాన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>