Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanth-biopic-lo-hero-dhanushf966fe5e-7dc7-44fe-863a-1fa158eaf002-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanth-biopic-lo-hero-dhanushf966fe5e-7dc7-44fe-863a-1fa158eaf002-415x250-IndiaHerald.jpgయంగ్‌ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న స్టార్ హీరో రజినీకాంత్.బస్‌ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగిన తీరు ఎంతోమంది ఆదర్శంగా భావిస్తారు. ఇప్పుడీ జర్నీనే సినిమాగా తీసుకురానున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జిక్ గా పనిచేస్తారు. అంతేకాకుండా వీలున్నప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. రజినీ చాలా నిరాండబరంగా గడుపుతారు. సూపర్ స్టార్ అన్న అహం ఏ మాత్రం ఉండదు, ఈ క్వాలిటీ చాలా కొద్ది మంది నటుల్లో మాత్రమేsocialstars lifestyle{#}dhanush;Ilayaraja;Rajani kanth;bollywood;Director;Tamil;Hero;News;Cinemaరజినికాంత్ బయోపిక్ లో హీరో ధనుష్..?రజినికాంత్ బయోపిక్ లో హీరో ధనుష్..?socialstars lifestyle{#}dhanush;Ilayaraja;Rajani kanth;bollywood;Director;Tamil;Hero;News;CinemaThu, 02 May 2024 07:15:54 GMTయంగ్‌ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న స్టార్ హీరో రజినీకాంత్.బస్‌ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన నేడు సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగిన తీరు ఎంతోమంది ఆదర్శంగా భావిస్తారు. ఇప్పుడీ జర్నీనే సినిమాగా తీసుకురానున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జిక్ గా పనిచేస్తారు. అంతేకాకుండా వీలున్నప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. రజినీ చాలా నిరాండబరంగా గడుపుతారు. సూపర్ స్టార్ అన్న అహం ఏ మాత్రం ఉండదు, ఈ క్వాలిటీ చాలా కొద్ది మంది నటుల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి అద్భుతమైన రజినీ జర్నీని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ బయోపిక్ సంబంధించి బాలీవుడ్ లో బజ్ నెలకొంది.

కాకపోతే ఇక్కడ రజనీకాంత్ పాత్రను సమర్ధవంతంగా పోషించే నటుడు ఎవరు? ఆయన జీవితాన్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించే డైరెక్టర్ ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తలైవర్ స్టయిల్ని, మ్యానరిజాన్ని గ్రేస్ ని మ్యాచ్ చెయ్యడం అంత ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది సినిమా ఫలితంపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే సూపర్ స్టార్ బయోపిక్ లో భాగమయ్యే దర్శక హీరోలు ఎవరో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికైతే రజనీ బయోపిక్లో తమిళ హీరో ధనుష్ నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న ధనుష్ అయితేనే, రజనీకాంత్ పాత్రకి న్యాయం చేయగలరని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.సాజిద్ నడియాడ్‍వాలా ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్‍ను కలిశారు. ఆయనతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఇన్‍స్టాగ్రామ్‍లో ఫొటో పోస్ట్ చేశారు. దిగ్గజ రజినీకాంత్‍తో కలిసి పని చేయడం నాకు చాలా గౌరవంగా ఉందంటూ క్యాప్షన్ రాశారు. దీంతో బయోపిక్ గురించి ఆయన అప్పుడే హింట్ ఇచ్చినట్టయింది.రజినీకాంత్ బయోపిక్ మూవీ షూటింగ్ 2025లో మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ బయోపిక్‍పై సాజిద్ నుంచి కానీ.. రజినీ నుంచి కానీ అధికారిక ప్రకటన రాలేదు. అయితే, త్వరలోనే ఈ విషయంపై అనౌన్స్‌మెంట్ వస్తుందనే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>