MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgదిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వంలో రూపొందిన రౌడీ బాయ్స్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఓ గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత ఈ యువ నటుడు సెల్ఫిష్ అనే మూవీ నasish{#}sithara;Sree Harsha Konuganti;Silver;Beautiful;Yuva;Chaitanya;BEAUTY;cinema theater;Ashish Vidyarthi;Heroine;Hero;Cinema;king;Telugu;Newsసితార బ్యానర్లో ఆశిష్ మూవీ..!సితార బ్యానర్లో ఆశిష్ మూవీ..!asish{#}sithara;Sree Harsha Konuganti;Silver;Beautiful;Yuva;Chaitanya;BEAUTY;cinema theater;Ashish Vidyarthi;Heroine;Hero;Cinema;king;Telugu;NewsThu, 02 May 2024 10:55:44 GMTదిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వంలో రూపొందిన రౌడీ బాయ్స్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఓ గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత ఈ యువ నటుడు సెల్ఫిష్ అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. మరి కొంత కాలం లోనే ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ యువ నటుడు "లవ్ మీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఆశిష్ ఓ క్రేజీ బ్యానర్ లో మూవీ చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఆశిష్ తన తదుపరి మూవీ ని చేయబోతున్నాడు. తాజాగా ఈ బ్యానర్ వారు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ సినిమా సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో 30 వ మూవీ గా రాబోతున్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>