PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-vs-kutami-manifesto-have-you-seen-the-sensational-point3e81f4f9-14f1-4dfb-9670-01dfda889fc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-vs-kutami-manifesto-have-you-seen-the-sensational-point3e81f4f9-14f1-4dfb-9670-01dfda889fc3-415x250-IndiaHerald.jpgరాష్ట్ర సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో ఇచ్చింది. ఇక‌, కూట‌మి పార్టీలుగా ఉన్న బీజేపీ(ఇది మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించినా.. సందేహాలు ఉన్నాయి), టీడీపీ, జన‌సేన‌లు ఉమ్మ‌డి మేనిఫెస్టో 2024 పేరుతో ప్ర‌జ‌గ‌ళాన్ని విడుద‌ల చేశాయి. స‌రే.. ఎవ‌రు స‌మర్థించారు..? ఎవ‌రు దూరంగా ఉన్నారు? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. అస‌లు ఈ రెండు మేనిఫెస్టోలో ఏది ప్ర‌జ‌ల‌కు అనుకూలం గా ఉంద‌నేది చ‌ర్చ‌నీయాంశం. ఈ కోణంలో చూసుకుంటే.. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ప్ర‌కారం.. ఇప్ప‌టికిప్పుడు.. వృAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; tdp; chandrababu; Manifesto {#}RTC;electricity;Party;YCP;TDPవైసీపీ Vs కూట‌మి మేనిఫెస్టో... సెన్షేష‌న‌ల్ పాయింట్ మీరు చూశారా ?వైసీపీ Vs కూట‌మి మేనిఫెస్టో... సెన్షేష‌న‌ల్ పాయింట్ మీరు చూశారా ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; tdp; chandrababu; Manifesto {#}RTC;electricity;Party;YCP;TDPThu, 02 May 2024 15:40:42 GMTరాష్ట్ర సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో ఇచ్చింది. ఇక‌, కూట‌మి పార్టీలుగా ఉన్న బీజేపీ(ఇది మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించినా.. సందేహాలు ఉన్నాయి), టీడీపీ, జన‌సేన‌లు ఉమ్మ‌డి మేనిఫెస్టో 2024 పేరుతో ప్ర‌జ‌గ‌ళాన్ని విడుద‌ల చేశాయి. స‌రే.. ఎవ‌రు స‌మర్థించారు..?  ఎవ‌రు దూరంగా ఉన్నారు?  అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. అస‌లు ఈ రెండు మేనిఫెస్టోలో ఏది ప్ర‌జ‌ల‌కు అనుకూలం గా ఉంద‌నేది చ‌ర్చ‌నీయాంశం.


ఈ కోణంలో చూసుకుంటే.. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ప్ర‌కారం.. ఇప్ప‌టికిప్పుడు.. వృద్ధులు, విక‌లాంగులు, వితంతు మ‌హిళ‌ల సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు రూ.1000 చొప్పున పెరుగుతున్నాయి. అదేవిధంగా మ‌హిళ ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేసే అవ‌కాశం ఉంది. ఈ రెండు అత్యంత కీల‌క‌మైన అంశా లు. అదేవిధంగా మ‌రో మెజారిటీ హామీ.. విద్యుత్ చార్జీల‌ను వ‌చ్చే ఐదేళ్ల పాటు పెంచ‌బోమ‌ని. ఇది మేలిమి హామీ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం ఐదేళ్ల‌లో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెరిగాయి.


రేపు మ‌రోసారి వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. విద్యుత్ చార్జీల‌ను మ‌రుక్ష‌ణ‌మే పెంచే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో విద్యుత్ చార్జీల‌ను పెంచ‌బోమ‌ని చెప్ప‌డం కూట‌మి ఇచ్చిన మేనిఫెస్టోకు ప్రాధాన్యం ఇచ్చింది. అదేవిధంగా రైతుల‌కు ఏటా రూ.20000 చొప్పు న ఇస్తామ‌న్న హామీని కూడా.. ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాలి. ఇది వైసీపీ మేనిఫెస్టోలో రూ.18000 గానే ఉంది. ఇక‌, ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అన్న‌ది వైసీపీ చెప్ప‌లేదు.


పింఛ‌న్ల‌ను పెంచుతామ‌ని వైసీపీ చెప్పినా.. ఇప్ప‌టికిప్పుడు కాదు. 2028 వ‌ర‌కు వేచి చూడాల్సిన ప‌రిస్థితి. అప్పుడు కూడా రూ.250 చొప్పునే పెంచుతామ‌న్నారు. ఇది ఒక‌ర‌కంగా అవ్వాతాత‌ల‌కు రుచించే విష‌యం కాదు. దీంతో ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలను సంక్షేమ కోణంలో చూసుకుంటే.. కూట‌మి మేనిఫెస్టోకే ఎక్కువ‌గా మార్కులు ప‌డుతున్నాయి. వైసీపీ ఈ విష‌యంలో తేలిపోయింది. కాబ‌ట్టి.. కూట‌మి మేనిఫెస్టోను ప్ర‌జ‌లు ఆద‌రిస్తే.. గెలుపు ఈజీనే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ.. ఇక్క‌డే పెద్ద చిక్కు ఉంది. టీడీపీ చెప్పింది చేస్తుందా? అనే సందేహం!  దీని నుంచి వారు బ‌య‌ట‌ప‌డితే.. త‌ప్ప‌.. న‌మ్మ‌కం అనేది ల‌భించే ప‌రిస్థితి లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>