PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysr-aarogyasri-stop-ap-politics0cef19a3-5a90-4fe7-b4ea-f6791c89edb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysr-aarogyasri-stop-ap-politics0cef19a3-5a90-4fe7-b4ea-f6791c89edb6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. పార్టీ నేతలు , అధినేతలు సైతం నువ్వా నేనా అనే అంటూ పోటీపడుతూ దూసుకుపోతున్నారు.. ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది.. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యశ్రీ సేవలపై నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈనెల నాలుగవ తేదీ నుంచి నగదు రహిత చికిత్YSR AAROGYASRI;STOP;AP POLITICS{#}sree;Letter;Arogyasri;Manam;Government;Party;Andhra Pradesh;Electionsఆరోగ్యశ్రీ: ప్రభుత్వానికి భారీ షాక్.. ప్రజల పరిస్థితి ఏంటో..?ఆరోగ్యశ్రీ: ప్రభుత్వానికి భారీ షాక్.. ప్రజల పరిస్థితి ఏంటో..?YSR AAROGYASRI;STOP;AP POLITICS{#}sree;Letter;Arogyasri;Manam;Government;Party;Andhra Pradesh;ElectionsThu, 02 May 2024 20:20:06 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. పార్టీ నేతలు , అధినేతలు సైతం నువ్వా నేనా అనే అంటూ పోటీపడుతూ దూసుకుపోతున్నారు.. ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది.. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యశ్రీ సేవలపై నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


ఈనెల నాలుగవ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలను నిలుపు వేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా తెలియజేసింది.. అందుకు ముఖ్య కారణం గడచిన ఆరు నెలల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో పాటు విజ్ఞప్తులు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.. ఈ విషయంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ ఈ విషయం పైన ఆగ్రహాన్ని తెలియజేశారు.. అంతేకాకుండా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యామంటూ కూడా ఒక లేఖలో తెలియజేయడం జరిగింది.


ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో నెట్వర్క్ ఆసుపత్రులు లేఖల ద్వారా తెలియజేశారు.. మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలను కూడా నిలిపివేయబోతున్నట్లు తెలియజేశారు.. మరి ఆరోగ్యశ్రీ చికిత్స  ఫీజుల చెల్లింపు విషయం పైన..అలాగే పదేళ్లుగా ప్యాకేజీ ధరలు పెంచకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విషయం అధికార పార్టీ వైసీపీకి కచ్చితంగా దెబ్బేసేలా కనిపిస్తోంది. మరి ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. ఎన్నికల సమయంలో కచ్చితంగా ఆరోగ్య శ్రీ అనేది చాలా కీలకమనేది కూడా చెప్పవచ్చు. మరొకవైపు ఈ పథకం పైన ఆధారపడి ఎంతోమంది ప్రజలు తమ ఆరోగ్యాలను బాగు చేసుకున్నారు ఇంకా చాలామంది ఈ పథకం పైనే ఆధారపడుతున్నారు  కూడా.. మరి ఇలాంటి  వారికి కూడా ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు .మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>