Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/divorce16b3a8ff-9a36-4c77-9460-3147bdf4451e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/divorce16b3a8ff-9a36-4c77-9460-3147bdf4451e-415x250-IndiaHerald.jpgనేటి సోషల్ మీడియా యుగంలో మనిషి లైఫ్ లో ఎన్నో విషయాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు తప్పు అనుకున్న విషయాలే నేటి రోజుల్లో ఒప్పు అనుకుంటున్న పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో చిత్ర విచిత్రకరమైన ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి ఒకప్పుడు ఒక్కసారి మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా ఇక కట్టుకున్న వాడితో ఉండేందుకే మహిళలు ఇష్టపడేవారు. అయితే అప్పటి పెద్దలు కూడా కట్టుకున్న వాడిని వDivorce{#}Kanpur;Uttar Pradesh;Ashish Vidyarthi;Husband;Parents;media;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Samsung;Appleవిడాకులు తీసుకున్న కూతురుకి.. బ్యాండ్ మేళతో స్వాగతం పలికిన పేరెంట్స్?విడాకులు తీసుకున్న కూతురుకి.. బ్యాండ్ మేళతో స్వాగతం పలికిన పేరెంట్స్?Divorce{#}Kanpur;Uttar Pradesh;Ashish Vidyarthi;Husband;Parents;media;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Samsung;AppleWed, 01 May 2024 13:00:00 GMTనేటి సోషల్ మీడియా యుగంలో మనిషి లైఫ్ లో ఎన్నో విషయాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు తప్పు అనుకున్న విషయాలే నేటి రోజుల్లో ఒప్పు అనుకుంటున్న పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో చిత్ర విచిత్రకరమైన ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి  ఒకప్పుడు ఒక్కసారి మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా  కూడా ఇక కట్టుకున్న వాడితో ఉండేందుకే మహిళలు ఇష్టపడేవారు. అయితే అప్పటి పెద్దలు కూడా కట్టుకున్న వాడిని వదిలేస్తే మహిళల జీవితం పాడవుతుంది అని చెప్పేవారు.


 అయితే నేటి టెక్నాలజీ జీవితంలో పురుషులతో సమానంగానే మహిళలకు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక భర్త నుంచి వేధింపులు ఎదురైతే చాలు భార్యలు వెంటనే వారి నుంచి విడాకులు తీసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇంకొంతమంది ఏకంగా ఇక మెట్టినింటిని వదిలి పుట్టింట్లోకి వచ్చి ఉండడం కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కూతురు ఒకవేళ కోపం లో నిర్ణయం తీసుకుంటే.. వైవాహిక బంధం అన్న తర్వాత గొడవలు జరుగుతూనే ఉంటాయి సర్దుకుపోయి బ్రతకాలి అని సర్ది చెప్పి తల్లిదండ్రులు కూతురి కాపురాని నిలబెడతారు.


 కానీ ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం కాస్త డిఫరెంట్. కూతురు విడాకులు తీసుకుని ఇంటికి వస్తే మేళతాళాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఉరివి అనే మహిళకు 8 ఏళ్ల కిందట ఆశిష్ రంజన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వీరికి ఒక కూతురు ఉంది. ఇక కూతురు పుట్టినప్పటి నుంచి అత్తమామలు భర్త వేధించడం మొదలుపెట్టారు. విసిగిపోయిన ఆమె ఇక విడాకులు తీసుకుంది  అయితే ఇలా విడాకులు తీసుకున్న కూతురికి ఆమె పేరెంట్స్ అండగా నిలిచారు. విడాకులు తీసుకొని పుట్టింటికి వచ్చిన  మహిళతో పాటు మనవరాలికి మేళతాళాలతో స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు తల్లిదండ్రులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>