Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-17deeecd-4930-4035-b0b8-7cc0898dd5b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-17deeecd-4930-4035-b0b8-7cc0898dd5b7-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న బిఆర్ఎస్ పార్టీకి భంగపాటు ఎదురయింది. తక్కువ సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే బిఆర్ఎస్ ఇలా ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఇక కారు పార్టీకి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఏకంగా ఎంతో మంది కీలక నేతలు గులాబీ పార్టీని వదిలి అటు హస్తం గూటికి చేరుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే బిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టి.. గులాబీ దళపతి కెసిఆర్ కు ఆత్మీయుడుగా ఉన్న కడKcr.{#}Warangal;Car;Dalapathi;srihari;MLA;Success;Joseph Vijay;Assembly;KCR;Congressకడియంతో.. కేసిఆర్ కు కొత్త చిక్కులు తప్పవా?కడియంతో.. కేసిఆర్ కు కొత్త చిక్కులు తప్పవా?Kcr.{#}Warangal;Car;Dalapathi;srihari;MLA;Success;Joseph Vijay;Assembly;KCR;CongressWed, 01 May 2024 08:00:00 GMTగత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న బిఆర్ఎస్ పార్టీకి భంగపాటు ఎదురయింది. తక్కువ సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే బిఆర్ఎస్ ఇలా ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఇక కారు పార్టీకి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఏకంగా ఎంతో మంది కీలక నేతలు గులాబీ పార్టీని వదిలి అటు హస్తం గూటికి చేరుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే బిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టి..  గులాబీ దళపతి కెసిఆర్ కు ఆత్మీయుడుగా ఉన్న కడియం శ్రీహరి పార్టీని వదలడం మాత్రం బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి.



 అయితే ఇలా కడియం శ్రీహరి తన కూతురు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు.. తన కూతురికి వరంగల్ ఎంపీ సీటును ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే కడియం ఇలా బిఆర్ఎస్ పార్టీని వీడారో లేదో అప్పటినుంచి అతనిని టార్గెట్ చేస్తూ ఇక గులాబీ పార్టీలోని కీలక నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఏకంగా ఇటీవల కడియం బిఆర్ఎస్ లోని కీలక నేతలందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కెసిఆర్ అక్రమాలు అన్నింటినీ కూడా బయట పెడతాను అంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం గమనార్హం.



 ఎన్నో ఏళ్లపాటు అటు బిఆర్ఎస్ లో కొనసాగిన కడియం శ్రీహరి కేసిఆర్ కు ఆప్తుడిగా ఉన్నారు. ఇక అన్ని వ్యవహారాలలో కేసీఆర్ కు సూచనలు సలహాలు ఇవ్వడంలో కూడా కీలకపాత్ర వహించారు  అలాంటి కడియం శ్రీహరికి ఇక అధికారంలో ఉండగా కేసీఆర్ చేసిన అక్రమాల గురించి ఎంతో కొంత తెలిసి ఉండే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఈ క్రమంలోనే తనను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అక్రమాల గురించి తనకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా బయట పెడతాను అంటూ ఏకంగా కడియం వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఒకరకంగా కడియం శ్రీహరితో కేసిఆర్ కు కొత్త చిక్కులు తప్పేలా లేవు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>