Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mim650c50bd-2eb4-431a-8db3-b3fcf433d7cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mim650c50bd-2eb4-431a-8db3-b3fcf433d7cb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టి కూడా ఒక పార్లమెంట్ స్థానం పైన ఉంది. అది హైదరాబాద్ స్థానం. అయితే హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ తప్ప మరో పార్టీ విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఎవరికి ఉండదు. అయితే ప్రధాన పార్టీలు కూడా విజయం సాధిస్తాము అనే నమ్మకాన్ని పెట్టుకోవు. దీంతో కేవలం డమ్మీ అభ్యర్థులను మాత్రమే నిలబెడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పోటీ నుంచి కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఈసారి మాత్రం అక్కడ ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఎంMim{#}Aly Khan;madhavi latha;sudhakar;venkaiah naidu;madhavi;history;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Narendra Modi;MIM Party;Yevaru;Hyderabad;Bharatiya Janata Party;Party;Parlimentఎంఐఎంపై ఉద్దండులే గెలవలేదు.. మాధవి లత గెలుస్తుందా?ఎంఐఎంపై ఉద్దండులే గెలవలేదు.. మాధవి లత గెలుస్తుందా?Mim{#}Aly Khan;madhavi latha;sudhakar;venkaiah naidu;madhavi;history;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Narendra Modi;MIM Party;Yevaru;Hyderabad;Bharatiya Janata Party;Party;ParlimentWed, 01 May 2024 12:00:00 GMTప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టి కూడా ఒక పార్లమెంట్ స్థానం పైన ఉంది. అది హైదరాబాద్ స్థానం. అయితే హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ తప్ప మరో పార్టీ విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఎవరికి ఉండదు. అయితే ప్రధాన పార్టీలు కూడా విజయం సాధిస్తాము అనే నమ్మకాన్ని పెట్టుకోవు. దీంతో కేవలం డమ్మీ అభ్యర్థులను మాత్రమే నిలబెడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు పోటీ నుంచి కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఈసారి మాత్రం అక్కడ ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఎంఐఎం కంచుకోట ను బద్దలు కొట్టి కాషాయ జండా ఎగరవేయాలని బిజెపి అనుకుంటుంది.


 ఈ క్రమంలోనే  ఓవైసీకి పోటీగా అక్కడ బిజెపి తరఫున మాధవి లతను బరిలోకి దింపింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. ఇక మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా కళ్ళకు కట్టినట్లు.. తన ప్రసంగాలతో చూపిస్తున్నారు. తన ప్రసంగాలలో హిందుత్వ వాదాన్ని ముందుకు నడిపిస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు మాధవి లత. మాధవి లత పోటీతో ప్రస్తుతం ఎంఐఎం పార్టీలో కూడా టెన్షన్ పట్టుకుంది అంటూ ఒక టాక్ వినిపిస్తోంది.


 అదే సమయంలో ఇప్పుడు మరో విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది  హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంఐఎం ను ఓడించేందుకు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు పోటీపడి ఓడిపోయారు. 1984 నుంచి ఇక్కడ మజిలీస్ పార్టీ జెండానే ఎగురుతూ వస్తుంది. సలావుద్దీన్ కుమారుడు అసదుద్దీన్  ఎంపీలుగా కొనసాగుతూ వచ్చారు. వీరిపై వి.హనుమంతరావు, ప్రభాకర్ రెడ్డి, పి ఇంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వెంకయ్య నాయుడు, బద్దం బాల్రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జాహీద్ అలీ ఖాన్ లాంటి ఎంతో మంది హేమహేమీలు పోటీపడ్డారు. అయినా ఓడిపోయారు  మరి ఈసారి అటు మాధవి లత గెలిచి చరిత్ర సృష్టిస్తుందా అందరిలాగానే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>