HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips6a3fd223-bcac-4d02-9acf-f3e0b07a5331-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips6a3fd223-bcac-4d02-9acf-f3e0b07a5331-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. ముఖ్యంగా దినచర్యలో మీరు ఉదయం మీ రోజును ఎలా ప్రారంభించాలన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.పీరియడ్స్ క్రాంప్స్ మహిళలని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుండి ఉపశమనం పొందడానికి ఏలకుల నీటిని కూడా తాగవచ్చు.. ఇది హార్మోన్ల అసమతుల్యతను శాంతపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ పానీయాన్ని మీ ఉదయపు భోజనంలో భాగం చేసుకోండి. అధ్యయనాల ప్రకారం, ఏలకులు బరుHealth Tips{#}Ayurveda;Antioxidantపొద్దున్నే నీటిలో ఇవి కలిపి తాగితే అనారోగ్య సమస్యలు మాయం?పొద్దున్నే నీటిలో ఇవి కలిపి తాగితే అనారోగ్య సమస్యలు మాయం?Health Tips{#}Ayurveda;AntioxidantWed, 01 May 2024 19:58:26 GMTప్రస్తుత కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. ముఖ్యంగా దినచర్యలో మీరు ఉదయం మీ రోజును ఎలా ప్రారంభించాలన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.పీరియడ్స్ క్రాంప్స్ మహిళలని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుండి ఉపశమనం పొందడానికి ఏలకుల నీటిని కూడా తాగవచ్చు.. ఇది హార్మోన్ల అసమతుల్యతను శాంతపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ పానీయాన్ని మీ ఉదయపు భోజనంలో భాగం చేసుకోండి. అధ్యయనాల ప్రకారం, ఏలకులు బరువు నియంత్రణలో సమర్థవంతమైన ఫలితాలను ఇస్తాయి. దీనికోసం కొన్ని నీటిలో ఏలకులను వేసి మరిగించి తాగాలి. పరగడుపున తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.శరీరాన్ని లోపల నుంచి నిర్విషీకరణ చేయడానికి ఇది ఉత్తమమైన పానీయంగా ఉపయోగపడుతుంది.. ఏలకుల లక్షణాలు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతాయి. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే ఏలకుల నీళ్లు తాగండి. ఈ మూలికలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.


ఇవి నోటి దుర్వాసనను తొలగించి నోటి పరిశుభ్రతను ప్రోత్సహిస్తాయి.ఈ హెర్బ్‌లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, అవసరమైన విటమిన్లు, మినరల్స్.. శక్తివంతమైనవి.. ఇవి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.అంతేగాక ఏలకులు ఎన్నో రకాల గుణాలను, పోషకాలను కలిగి ఉన్నాయి. ఉదయాన్నే పరగడుపున ఏలకుల నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఏలకులు ఒక ఆయుర్వేద మూలిక.. ఇది సుగంధ ద్రవ్యాల పరిధిలోకి వస్తుంది. దాని వాసన, రుచి, లక్షణాల కారణంగా.. దీనిని ఔషధంగా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఇది సహాయకరంగా ఉంటుంది.కొంతమంది టీతో రోజుని ప్రారంభిస్తే, మరికొందరు వేడినీరు తాగుతూ రోజును ప్రారంభిస్తారు. ఇది చాలా మంచి అలవాటు కాబట్టి ఖచ్చితంగా ట్రై చెయ్యండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>