MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-or-ycp-where-does-junior-standdaaea851-e403-461f-bd76-d27fe21760ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-or-ycp-where-does-junior-standdaaea851-e403-461f-bd76-d27fe21760ca-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుపొందడంతో ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ దక్కింది. ఇక గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన తన తదుపరి మూవీ లను కూడా అదిరిపోయే రేంజ్ స్థాయిలోనే చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని ఈ సంవjr ntr{#}Saif Ali Khan;October;Oscar;Alia Bhatt;Ranbir Kapoor;NTR;News;Hindi;koratala siva;Rajamouli;Jr NTR;Heroine;Music;Cinemaమరో బాలీవుడ్ సీక్వెల్లో ఎన్టీఆర్..?మరో బాలీవుడ్ సీక్వెల్లో ఎన్టీఆర్..?jr ntr{#}Saif Ali Khan;October;Oscar;Alia Bhatt;Ranbir Kapoor;NTR;News;Hindi;koratala siva;Rajamouli;Jr NTR;Heroine;Music;CinemaWed, 01 May 2024 00:26:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుపొందడంతో ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ దక్కింది. ఇక గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన తన తదుపరి మూవీ లను కూడా అదిరిపోయే రేంజ్ స్థాయిలోనే చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ తో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ "వార్ 2" అనే హిందీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు.

ఇకపోతే కొంతకాలం క్రితం బ్రహ్మాస్త్ర అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇందులో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి కొనసాగింపుగా బ్రహ్మాస్త్ర 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం రణబీర్ కపూర్ , ఆలియా భట్ లతో పాటు ఎన్టీఆర్ ఓ పార్టీలో కనిపించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ... బ్రహ్మాస్త్ర 2 ఎన్టీఆర్ నటించడం లేదు. రణబీర్ కపూర్ , ఆలియా భట్ కలయికలోనే బ్రహ్మాస్త్ర 2 రాబోతుంది అని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>