MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pawan-kalyan27a12b96-a46d-4ae6-b9e4-9986bb9a03c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pawan-kalyan27a12b96-a46d-4ae6-b9e4-9986bb9a03c7-415x250-IndiaHerald.jpg‘హరిహర వీరమల్లు’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో మొదలైంది. ఆ సినిమా తర్వాత ప్రారంభమైన ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ వంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది.పైగా ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయ్యింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకో పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోలేదు. ఎన్నికల టైం కాబట్టి.. మే 11 దాకా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటారు.ఇక ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తPawan Kalyan{#}producer;Producer;kalyan;Pawan Kalyan;June;Cinema;News;India;Electionహరిహర వీరమల్లు: పవన్ లేకుండానే టీజరా? సాహసమే?హరిహర వీరమల్లు: పవన్ లేకుండానే టీజరా? సాహసమే?Pawan Kalyan{#}producer;Producer;kalyan;Pawan Kalyan;June;Cinema;News;India;ElectionWed, 01 May 2024 13:08:18 GMT‘హరిహర వీరమల్లు’  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  27 వ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో మొదలైంది. ఆ సినిమా తర్వాత ప్రారంభమైన ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’  వంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది.పైగా ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయ్యింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకో పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోలేదు. ఎన్నికల టైం కాబట్టి.. మే 11 దాకా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉంటారు.ఇక ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉంది. జూన్ 4 టైంకి ఫలితాలు వచ్చేస్తాయి. కాబట్టి.. జూన్ నెల చివరి వారంలో మళ్ళీ షూటింగ్లకి హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మే 2 వ తేదిన ‘హరిహర వీరమల్లు’ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే అసలు పవన్ కళ్యాణ్ పార్ట్ .. 20 శాతం కూడా కంప్లీట్ చేసింది లేదు. అయినా సరే ఉన్న ఫుటేజ్ తో ఈ మూవీ నుంచి గ్లింప్స్ వదిలారు. మళ్ళీ ఇప్పుడు టీజర్ వదలడానికి రెడీ అయ్యారు.


మే 2 వ తేదీన ‘హరిహర వీరమల్లు’ మూవీ నుండి టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. చిత్ర బృందం ఈ విషయం పై ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది కాబట్టి.. షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అని నిర్మాత ఏ.ఎం.రత్నం మొన్నామధ్య చెప్పకనే చెప్పారు. సో ఈ ఏడాది అయితే ‘హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టం అని ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని పవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.ఈ సినిమా ఆగిపోయినట్లుగా ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఇక ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడమే కష్టమే అనేలా వచ్చిన వార్తలకు నిర్మాత ఏఎం రత్నం.. ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు టీజర్ వదిలి.. అలాంటి వార్తలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్సినిమా బ్యాలెన్స్ షూట్‌లో పాల్గొనున్నారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>