Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/bihard38f139b-33e9-4637-a0e3-58c0958cecfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/bihard38f139b-33e9-4637-a0e3-58c0958cecfb-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. యువతి యువకులు ఇద్దరు కూడా పెళ్లి విషయంలో కోటి ఆశలను పెట్టుకుంటారు. అర్థం చేసుకునే యువతి తమ లైఫ్ లోకి వస్తే ఇక జీవితం మొత్తం సంతోషంగా ఉండవచ్చు అని అబ్బాయిలు అనుకుంటే.. అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండే భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఇంకేం ఉంటుంది అని అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. ఇలా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక నచ్చిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడం చేస్తూ ఉంటారూ అనే విషయం తెలిసింది. ఈ క్రమంలోనే Bihar{#}Husband;vedhika;Manam;marriageపీకలదాకా తాగొచ్చిన వరుడు.. దీంతో వధువు ఏం చేసిందంటే?పీకలదాకా తాగొచ్చిన వరుడు.. దీంతో వధువు ఏం చేసిందంటే?Bihar{#}Husband;vedhika;Manam;marriageWed, 01 May 2024 09:25:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. యువతి యువకులు ఇద్దరు కూడా పెళ్లి విషయంలో కోటి ఆశలను పెట్టుకుంటారు. అర్థం చేసుకునే యువతి తమ లైఫ్ లోకి వస్తే ఇక జీవితం మొత్తం సంతోషంగా ఉండవచ్చు అని అబ్బాయిలు అనుకుంటే.. అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండే భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఇంకేం ఉంటుంది అని అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. ఇలా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక నచ్చిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడం చేస్తూ ఉంటారూ అనే విషయం తెలిసింది.


 ఈ క్రమంలోనే  పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ఎంతో మంది ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పెళ్లి విషయంలో చిత్ర ఉచితంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏకంగా పెళ్లి మండపంలోకి సైతం ఫుల్లుగా తాగి వచ్చి పీటల మీద కూర్చోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయ్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పెళ్లి వేడుకను ఇక్కడ ఒక వ్యక్తి దుర్భరంగా మార్చుకున్నాడు.


 ఎంతో బుద్ధిగా పెళ్లి వేడుకకు హాజరు కావలసిన వరుడు ఏకంగా పీకలదాకా తాగేసాడు. దీంతో కనీసం వివాహ వేదిక వద్దకు కూడా రాకుండా ఒక కారులో పడిపోయాడు. దీంతో పెళ్లి సమయానికి వరుడు రాకపోవడంతో బంధువులంతా వెతికి అతనిని తీసుకువచ్చారు. సదరు వ్యక్తి ఇలా పీకలు దాకా తాగి వచ్చాడు అన్న విషయాన్ని గమనించిన వధువు మనిషా పెళ్లి వద్దే వద్దు అంటూ తెగేసి చెప్పేసింది. ఇక పెళ్లి వేడుక కోసం ఖర్చయిన నాలుగు లక్షల తిరిగి చెల్లించాలి అంటూ వరుడు అతని కుటుంబ సభ్యులను బంధించారు. దీంతో చేసేది ఏమీ లేక వరుడి కుటుంబ సభ్యులు డబ్బు కట్టి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>