MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-nareshs-aoa-seals-no-competition-slot568210a2-45c4-4c6b-bacb-7dbcac18003d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allari-nareshs-aoa-seals-no-competition-slot568210a2-45c4-4c6b-bacb-7dbcac18003d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఆఖరుగా సుడిగాడు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన ఎన్నో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా సుడిగాడు రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇక దానితో ఈయన అనేక అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రావడంతో తన రూటు ను మార్చాడు. అందులో భాగంగా నాంది అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని నరేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. naresh{#}Sudigaadu;Akkineni Nagarjuna;Naresh;allari naresh;Comedy;Success;Hero;Box office;cinema theater;Cinema"ఆ ఒక్కటి అడక్కు" రన్ టైమ్ లాక్..?"ఆ ఒక్కటి అడక్కు" రన్ టైమ్ లాక్..?naresh{#}Sudigaadu;Akkineni Nagarjuna;Naresh;allari naresh;Comedy;Success;Hero;Box office;cinema theater;CinemaWed, 01 May 2024 03:00:00 GMTటాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఆఖరుగా సుడిగాడు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన ఎన్నో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా సుడిగాడు రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇక దానితో ఈయన అనేక అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రావడంతో తన రూటు ను మార్చాడు. అందులో భాగంగా నాంది అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది.

అలాగే ఇందులోని నరేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. దానితో ఈయన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ఉగ్రం అనే వైవిధ్యమైన సినిమాలలో హీరో గా నటించాడు. కాకపోతే ఈ రెండు మూవీ లు కూడా ఈయనకు నిరాశనే మిగిల్చాయి. కొంత కాలం క్రితం ఈ నటుడు నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అల్లరి నరేష్ కి కూడా ఈ సినిమాలోని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత నరేష్ "ఆ ఒక్కటి అడక్కు" అనే ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ కి మళ్లీ అంకం దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేశారు. ఈ మూవీ 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నరేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>