Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ameer-khand4fd26ab-6dec-4b5b-9884-94093c668a64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ameer-khand4fd26ab-6dec-4b5b-9884-94093c668a64-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఫిట్నెస్ మీద పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు. కానీ నేటి జనరేషన్ లో మాత్రం ఫిట్నెస్ లేకపోతే హీరో హీరోయిన్లకి అవకాశాలు తగ్గుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు ఇక హీరోయిన్లందరూ కూడా ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ తమ అందంతో అందరిని ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది హీరోలు అయితే ఏజ్ పెరుగుతుంది. కానీ అందం అక్కడే ఆగిపోయిందేమో అన్న విధంగా ఇక ఎప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు గానే కొనసాగుతూ ఉంటారు. అలాంటి హీరోలAmeer khan{#}Salman Khan;Akkineni Nagarjuna;bollywood;Jr NTR;Aamir Khan;Mr Perfect;college;Hero;Tollywood;Cinemaనా యవ్వన రహస్యం అదే.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన అమీర్ ఖాన్?నా యవ్వన రహస్యం అదే.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన అమీర్ ఖాన్?Ameer khan{#}Salman Khan;Akkineni Nagarjuna;bollywood;Jr NTR;Aamir Khan;Mr Perfect;college;Hero;Tollywood;CinemaWed, 01 May 2024 18:00:00 GMTఒకప్పుడు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఫిట్నెస్ మీద పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు. కానీ నేటి జనరేషన్ లో మాత్రం ఫిట్నెస్ లేకపోతే హీరో హీరోయిన్లకి అవకాశాలు తగ్గుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు ఇక హీరోయిన్లందరూ కూడా ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ తమ అందంతో అందరిని ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక కొంతమంది హీరోలు అయితే ఏజ్ పెరుగుతుంది. కానీ అందం అక్కడే ఆగిపోయిందేమో అన్న విధంగా ఇక ఎప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు గానే కొనసాగుతూ ఉంటారు. అలాంటి హీరోలలో టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున ఒకరు. ఆయన 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా 30 ఏళ్ల యువకుడి లాగానే కనిపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఆయనకు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ అదే రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి  అయితే బాలీవుడ్ లో ఇలా సీనియర్ హీరో అయినప్పటికీ కాలేజీ కుర్రాడి పాత్రలో సైతం సెట్ అయ్యే హీరో ఎవరు అంటే మొదటగా డైరెక్టర్లు నోటి నుంచి వచ్చే పేరు అమీర్ ఖాన్. మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ 59 ఏళ్ల వయసులోనూ కాలేజీ కుర్రాడి పాత్రలు చేయగలడు.


 ఆ పాత్రలో సరిగా సరిపోయి పాత్రకి ప్రాణం పోయగలరు అని చెప్పాలి. ఇలా 59 ఏళ్ల వయసులో కూడా అమీర్ ఖాన్ అంత యంగ్ గా ఎలా కనిపిస్తాడు.. అసలు ఆయన ఏం తింటాడు అన్న విషయాన్ని ఇక అమీర్ అభిమానులు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉంటారు. అయితే తన ఫిట్నెస్ యొక్క రహస్యం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల ఒక షోలో వెల్లడించాడు.  యవ్వనంగా కనిపించాలని చాలామంది చాలా క్రీములు రాస్తూ ఉంటారు. ఏవేవో పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. నేను అలాంటివి ఏమీ రాయను ఇక ఎలాంటి పద్ధతులను అనుసరించను. అదే నా ఫిట్నెస్ రహస్యం అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉంది అంటూ తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>