PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy4fcee145-f534-4cbc-9afe-fb54ba4c01ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy4fcee145-f534-4cbc-9afe-fb54ba4c01ba-415x250-IndiaHerald.jpgఅవును, మొన్న జగన్... ఈరోజు విజయ సాయిరెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోని రెండుసార్లు విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకత ఏమిటని అనుకుంటున్నారా? ప్రత్యేక మేనిఫెస్టో మరి! వైస్సార్సీపీ లీడర్, సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో అయన తాజాగా ప్రత్యేకంగా స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. విషయం ఏమిటంటే, నెల్లూరు లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మేనిఫెస్టో ఇది అని ఈvijay sai reddy{#}CBN;Bharatiya Janata Party;Telugu Desam Party;V Vijayasai Reddy;Narendra Modi;Nellore;Prime Minister;Reddy;Party;local language;Telangana Chief Minister;Assemblyఏపీ: మొన్న జగన్, ఈరోజు విజయ సాయిరెడ్డి... ప్రత్యేక మేనిఫెస్టో షురూ!ఏపీ: మొన్న జగన్, ఈరోజు విజయ సాయిరెడ్డి... ప్రత్యేక మేనిఫెస్టో షురూ!vijay sai reddy{#}CBN;Bharatiya Janata Party;Telugu Desam Party;V Vijayasai Reddy;Narendra Modi;Nellore;Prime Minister;Reddy;Party;local language;Telangana Chief Minister;AssemblyWed, 01 May 2024 12:39:00 GMTఅవును, మొన్న జగన్... ఈరోజు విజయ సాయిరెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోని రెండుసార్లు విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకత ఏమిటని అనుకుంటున్నారా? ప్రత్యేక మేనిఫెస్టో మరి! వైస్సార్సీపీ లీడర్, సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో అయన తాజాగా ప్రత్యేకంగా స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. విషయం ఏమిటంటే, నెల్లూరు లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మేనిఫెస్టో ఇది అని ఈ సందర్భంగా అయన పేర్కొన్నారు. కాగా ఇందులో 46 హామీలను పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్ఫూర్తితో నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఓ సమగ్ర డాక్యుమెంట్‌ను రూపొందించామని చెప్పుకొచ్చారు.

నెల్లూరు లోక్‌సభ, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను సునాయాసంగా క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని, ఆ విశ్వాసంతో ఎన్నికలను ధీటుగా ఎదుర్కొంటోన్నామని సాయిరెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడంతో అక్కడున్న వైస్సార్సీపీ కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేసారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని, యూనిఫాం సివిల్‌ కోడ్‌ను తప్పకుండా అమలు చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. అదేవిధంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఈ సివిల్‌ కోడ్‌ను ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ సమర్ధిస్తుందా? లేదా? అని అనుమానంగా ఉందని అన్నారు. ఆ విషయంపై చంద్రబాబును పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.

ఇక యూనిఫాం సివిల్‌ కోడ్‌ను ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, బీసీలు సైతం వ్యతిరేకిస్తున్నారని, ఇలాంటి బిల్లును వైఎస్‌ఆర్సీపీ ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదని కూడా సాయిరెడ్డి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. కాగా ఈ యూనిఫాం సివిల్‌ కోడ్‌పై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు బీజేపీ స్థానిక నాయకత్వం కలుపుకొని సూటిగా సమాధానం చెప్పి తీరాలని అడిగారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఫొటోలు మాత్రమే ఉన్నాయని, మిత్రపక్షమైన బీజేపీ సీనియర్ నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో అస్సలు లేదని.. ప్రజలు గమనించాలని అన్నారు. ఇదంతా ముస్లిం సామాజికవర్గ ఓట్ల కోసమేనని.. మోదీ ఫొటో వాడితే ముస్లింలు తమకు ఓట్లు వేయరనే భయంతోనే చంద్రబాబు నడిపిస్తోన్న కుట్రగా అభివర్ణించారు సాయిరెడ్డి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>