EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modida8ef51a-9bad-48eb-90c4-579661ce175c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modida8ef51a-9bad-48eb-90c4-579661ce175c-415x250-IndiaHerald.jpgఏపీ విషయంలో బీజేపీకి స్పష్టత వచ్చింది. ఏపార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీతో కూటమి కట్టినా.. బీజేపీ వైసీపీపై ఇరుకున పెట్టేలా మాట్లాడటం లేదు. కనీసం ఒక్కమాట కూడా అనడం లేదు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారే తప్ప.. బీజేపీ పై వైసీపీ నేతలు కూడా ఎటువంటి విమర్శలు చేయడం లేదు. దీంతో బీజేపీతో వైసీపీ ఒప్పందం చేసుకుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాన అనచరుడు సునీల్ బన్సల్ ఏపీ విషయంలో కీలక వ్యాఖ్modi{#}Survey;Amit Shah;central government;YCP;Andhra Pradesh;TDP;CBN;Minister;MP;Bharatiya Janata Party;Party;sunil;June;Newsగెలిచేది మళ్లీ జగనే.. అందుకే మోదీ జాగ్రత్త పడుతున్నారా?గెలిచేది మళ్లీ జగనే.. అందుకే మోదీ జాగ్రత్త పడుతున్నారా?modi{#}Survey;Amit Shah;central government;YCP;Andhra Pradesh;TDP;CBN;Minister;MP;Bharatiya Janata Party;Party;sunil;June;NewsWed, 01 May 2024 09:00:00 GMTఏపీ విషయంలో బీజేపీకి స్పష్టత వచ్చింది.  ఏపార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ తో కూటమి కట్టినా.. బీజేపీ వైసీపీ పై ఇరుకున పెట్టేలా మాట్లాడటం లేదు. కనీసం ఒక్క మాట కూడా అనడం లేదు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారే తప్ప.. బీజేపీ పై వైసీపీ నేతలు కూడా ఎటువంటి విమర్శలు చేయడం లేదు.


దీంతో బీజేపీ తో వైసీపీ ఒప్పందం చేసుకుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాన అనచరుడు సునీల్ బన్సల్ ఏపీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో అంతర్గితంగా సర్వే చేశామని... కేంద్రం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.


సునీల్ బన్సల్ ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రానుందని కేంద్రానికి  సమచారం ఉందని స్పష్టం చేశారు. 145 స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుపొందుతారు అని తమకు నివేదిక అందిందని ప్రకటించారు. 23 ఎంపీ స్థానాలను సైతం గెలుచుకోనున్నట్లు స్పష్టం చేశారు.   కాగా ఇప్పటి వరకు 11 సర్వేలు టీడీపీ కూటమి స్పష్టమైన విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. జూన్ 4 న ఫలితాలు వస్తాయని.. జూన్ 9 న రాష్ట్ర సీఎంగా చంద్ర బాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు అని చెప్పడం విశేషం.


వాస్తవానికి సునీల్ బన్సల్ అమిత్ షాకు వీర విధేయుడు. కేంద్రంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అటువంటి నేత ఇప్పుడు ఏపీలో కూటమిదే అధికారం అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్నటి వరకు వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ప్రస్తుతం గెలిస్తే చాలు అన్న రీతికి వచ్చింది. మరి ఎన్నికల ఫలితాల రోజున ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>