HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipscbd2f010-391c-4bcb-acee-597baf47dcd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipscbd2f010-391c-4bcb-acee-597baf47dcd2-415x250-IndiaHerald.jpgఉలవలు మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి. వాతం, శ్వాస, మూలవ్యాధి, ఖఫం తగ్గించడం వంటి వాటికి ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి. రుతు సమస్యలను నివారిస్తుంది. ఉలవలలోని ఐరన్, ఫాస్ఫరస్ ఎనీమీయాను నివారిస్తాయి. ఇందులోని కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది.రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవలHealth Tips{#}Heart;Calcium;Cholesterol;Horse gramవీటిని తింటే అనేక రోగాలని నివారించవచ్చు?వీటిని తింటే అనేక రోగాలని నివారించవచ్చు?Health Tips{#}Heart;Calcium;Cholesterol;Horse gramWed, 01 May 2024 19:39:11 GMTఉలవలు మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి. వాతం, శ్వాస, మూలవ్యాధి, ఖఫం తగ్గించడం వంటి వాటికి ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి. రుతు సమస్యలను నివారిస్తుంది. ఉలవలలోని ఐరన్, ఫాస్ఫరస్ ఎనీమీయాను నివారిస్తాయి. ఇందులోని కాల్షియం ఎముకులకు, కండరాలకు శక్తినిస్తుంది. ఇక ఇందులోని ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది.రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ టిప్ ట్రై చేయండి.పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకోవడం చాలా మంచిది.


ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది.కిడ్నీలో రాళ్లను నయం చేయడానికి ఉలవలను ఉపయోగించవచ్చు. ఇది ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, స్టెరాయిడ్లు మరియు సపోనిన్లు వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కలిగి ఉంటుంది. కిడ్నీ సమస్యలను నివారించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. రోజూ ఉదయాన్నే ఉలవల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.ఉలవలు బీపీని కూడా అదుపులో ఉంచుతాయి. రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం వస్తుంది. ఉలవల్లో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి నీరసం, నిసత్తువను తగ్గిస్తాయి. ఎదిగే పిల్లలకు వారి శరీర నిర్మాణం చక్కగా ఉండేందుకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>