PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/space37965ddf-3e42-4b70-9007-0bbd251ef75c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/space37965ddf-3e42-4b70-9007-0bbd251ef75c-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ దేశంపై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా నడచుకుంటోంది. ఈ నేపథ్యంలో యూఎస్ కు షాక్ ఇవ్వడానికి రష్యా రెడీ అయిందనే వార్తలు ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం లక్ష్యంగా ఓ అంతరిక్ష ఆయుధాన్ని ప్రయోగించే సూచనల ఉన్నాయని వార్తలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. అంతరిక్షంలో శాటిలైట్లు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యాలన్నీ శాటిలైట్లను పెద్ద ఎత్తున అంతరిక్షంలో మొహరిస్తున్నాయి. ఒకవేళ ప్రపంచ యుద్ధమే సంభవిస్తే.. space{#}Ukraine;American Samoa;Shatru;white house;war;Russia;INTERNATIONAL;Newsఅంతరిక్షంలో రష్యా సంచలనం.. ప్రపంచ పోరు తప్పదా?అంతరిక్షంలో రష్యా సంచలనం.. ప్రపంచ పోరు తప్పదా?space{#}Ukraine;American Samoa;Shatru;white house;war;Russia;INTERNATIONAL;NewsTue, 30 Apr 2024 09:03:00 GMTరష్యా ఉక్రెయిన్ దేశంపై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా నడచుకుంటోంది. ఈ నేపథ్యంలో యూఎస్ కు షాక్ ఇవ్వడానికి రష్యా రెడీ అయిందనే వార్తలు ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం లక్ష్యంగా ఓ అంతరిక్ష ఆయుధాన్ని ప్రయోగించే సూచనల ఉన్నాయని వార్తలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి.


అంతరిక్షంలో శాటిలైట్లు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యాలన్నీ శాటిలైట్లను పెద్ద ఎత్తున అంతరిక్షంలో మొహరిస్తున్నాయి. ఒకవేళ ప్రపంచ యుద్ధమే సంభవిస్తే.. శాటిలైట్లపైన ఆయుధాలను ప్రయోగిస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే అంతరిక్షంలో శాటిలైట్లను ధ్వంసం చేసే కెపాసిటీ కలిగిన ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను రష్యా డెవలప్ చేస్తోందన్న వార్తలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. ప్రపంచాన్నే నాశనం చేసే ఈ తరహా టెక్నాలజీని డెవలప్ చేసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుండటం ఆందోళన కరమని వైట్ హౌస్ తెలిపింది.


రష్యా ఈ టెక్నాలజీని వినియోగిస్తే 1967లో కుదిరిన ఔటర్ స్పేస్ ట్రీటీని ఉల్లంఘించినట్లే అవుతుందని అమెరికా వాదిస్తోంది. అంతరిక్షంలో అణ్వాయుధ వినియోగాన్ని ఔటర్ స్పేస్ నిషేదించిదని పేర్కొంది. ఇలాంటి ఆయుధాలతో భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల్లో ఉండే వ్యామగాములకు తీవ్ర ప్రమాదం ఉంటుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.


అయితే అంతరిక్షంలో అణ్వాయుధాలను పంపించి అక్కడి నుంచి తమ శత్రు దేశాలను దెబ్బతీసేలా రష్యా,  చైనాలు తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇప్పటికే ఈ మేరకు ఈ రెండు దేశాలు తమ ప్రయోగాలను ముమ్మరం చేశాయని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు ఐరాసలో ఒక తీర్మానం ప్రవేశ పెట్టాయి. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను తీసుకెళ్లకూడదని ఈ తీర్మాన ఉద్దేశం. అయితే రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ తీర్మానాన్ని వీగిపోయేలా చేసింది. తద్వారా అంతరిక్షంలో అణ్వాయుధాలను మొహరిస్తున్నాం అని చెప్పకనే చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>