PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kutami-manipost-viral-bjp-janaseana-tdpd26ed6b7-ac3c-4c6f-a842-dbd00d579922-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kutami-manipost-viral-bjp-janaseana-tdpd26ed6b7-ac3c-4c6f-a842-dbd00d579922-415x250-IndiaHerald.jpg - ఏప్రిల్ నుంచే ఫెన్ష‌న్ రు. 4 వేలుగా ప్ర‌క‌ట‌న‌ - విక‌లాంగుల‌కు రు. 6 వేలు.. పూర్తి విక‌లాంగుల‌కు రు. 15 వేలు ( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ ) ఏపీ జ‌నాలు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తోన్న కూట‌మి పార్టీల మేనిఫెస్టో ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కూట‌మి పార్టీ నేత‌లు ముగ్గురు క‌లిసి రిలీజ్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నుంచి వ‌చ్చిన సిద్ధార్థ్ నాథ్ సింగ్ ముగ్గురు క‌లిసి రిలీజ్ చేశారు. మేనిఫెస్టో నూ పూర్తిగా చూస్తే చాలాkutami;manipost;viral;bjp;janaseana;tdp{#}June;kalyan;Party;India;Bharatiya Janata Party;Janasena;Siddharth;YCPవామ్మో కూట‌మి మేనిఫోస్టోలో జ‌గ‌న్ బిగ్ షాక్‌.. ఆ హైలెట్ ఇదే...!వామ్మో కూట‌మి మేనిఫోస్టోలో జ‌గ‌న్ బిగ్ షాక్‌.. ఆ హైలెట్ ఇదే...!kutami;manipost;viral;bjp;janaseana;tdp{#}June;kalyan;Party;India;Bharatiya Janata Party;Janasena;Siddharth;YCPTue, 30 Apr 2024 16:30:28 GMT
- ఏప్రిల్ నుంచే ఫెన్ష‌న్ రు. 4 వేలుగా ప్ర‌క‌ట‌న‌
- విక‌లాంగుల‌కు రు. 6 వేలు.. పూర్తి విక‌లాంగుల‌కు రు. 15 వేలు

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

ఏపీ జ‌నాలు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తోన్న కూట‌మి పార్టీల మేనిఫెస్టో ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కూట‌మి పార్టీ నేత‌లు ముగ్గురు క‌లిసి రిలీజ్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నుంచి వ‌చ్చిన సిద్ధార్థ్ నాథ్ సింగ్ ముగ్గురు క‌లిసి రిలీజ్ చేశారు. మేనిఫెస్టో నూ పూర్తిగా చూస్తే చాలా అంశాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక మేనిఫోస్టో లో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది.


మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం ఇంకో 500 రూపాయిలు పెంచుతూ మొత్తం.. 4 వేల రూపాయిలు ఫెన్ష‌న్ కింద‌ ఇస్తామని ప్రకటించింది. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం విశేషం. జూన్ నెల‌లో తీసుకునే ఫెన్ష‌న్ లో ఏప్రిల్ , మే , జూన్ ఈ మూడు నెల‌ల‌కు వెయ్యి చొప్పున మూడు వేలు పెంచి.. జూన్‌లో మొత్తం రు. 7 వేలు పెన్ష‌న్ కింద ఇస్తామ‌ని చెప్ప‌డం విశేషం.


ఇక విక‌లాంగుల పెన్ష‌న్లు కూడా చంద్ర‌బాబు భారీగా పెంచేశారు. వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వైసీపీకి బిగ్ షాకేనని.. ఇది నిజంగా ఊహించని రీతిలో ఉందని రాజకీయ విశ్లేషకులు చ‌ర్చించు కుంటున్నారు. కూట‌మిలో ఎన్ని మంచి ప‌థ‌కాలు ఉన్నా కూడా ఈ ఫెన్ష‌న్లు భారీగా పెంచ‌డం అనేది ఓవ‌రాల్ గా మేనిఫోస్టో కే హైలెట్ అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>