PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-political-news-telugu-latest-jagan-pawan-kalyan-pavan-kalyan-jsp-bjp-cbn9010fe9f-a3ae-4050-b887-5f3c33598ffb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-political-news-telugu-latest-jagan-pawan-kalyan-pavan-kalyan-jsp-bjp-cbn9010fe9f-a3ae-4050-b887-5f3c33598ffb-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల హీట్ వేసవి వేడిమిని మించిపోయింది. విపక్షాలు ప్రచారంలో తనమునకలై ఉన్నాయి. ఒకవైపు ఈసారి కూడా మేమే ప్రభుత్వాన్ని స్థాపించాలని వైసీపీ కలలు కంటే, ఈసారైనా ఖచ్చితంగా గెలివాలి అన్న సంకల్పంతో కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ, బీజేపీ ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్నటికి నిన్నే బాబాయ్ కి అండగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పర్యటించగా ఇపుడు అన్న మెగాస్టార్ చిరంజీవి పేరు గట్టిగా వినబడుతోంది.ap political news telugu latest jagan pawan kalyan pavan kalyan jsp bjp cbn{#}Nagababu;Anakapalle;Prajarajyam Party;Pendurthi;pithapuram;varun tej;media;CM;Andhra Pradesh;Janasena;Bharatiya Janata Party;Congress;Rajya Sabha;kalyan;Assembly;MLA;YCP;Chiranjeeviఏపీ: బరిలోకి మెగాస్టార్... జనసేనానికి ఉపయోగపడునా?ఏపీ: బరిలోకి మెగాస్టార్... జనసేనానికి ఉపయోగపడునా?ap political news telugu latest jagan pawan kalyan pavan kalyan jsp bjp cbn{#}Nagababu;Anakapalle;Prajarajyam Party;Pendurthi;pithapuram;varun tej;media;CM;Andhra Pradesh;Janasena;Bharatiya Janata Party;Congress;Rajya Sabha;kalyan;Assembly;MLA;YCP;ChiranjeeviTue, 30 Apr 2024 12:06:33 GMTఏపీలో ఎన్నికల హీట్ వేసవి వేడిమిని మించిపోయింది. విపక్షాలు ప్రచారంలో తనమునకలై ఉన్నాయి. ఒకవైపు ఈసారి కూడా మేమే ప్రభుత్వాన్ని స్థాపించాలని వైసీపీ కలలు కంటే, ఈసారైనా ఖచ్చితంగా గెలివాలి అన్న సంకల్పంతో కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ, బీజేపీ ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్నటికి నిన్నే బాబాయ్ కి అండగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పర్యటించగా ఇపుడు అన్న మెగాస్టార్ చిరంజీవి పేరు గట్టిగా వినబడుతోంది.

అవును, చిరు పొలిటికల్ రీ ఎంట్రీకి సర్వం సిద్ధం అంటూ గుసగుసలు వినబడుతున్నాయి. అయితే అవి గుసగుసలు కావు... నిజమే అని అంటున్నాయి జనసేన వర్గాలు. ఈ మేరకు సోషల్ మీడియాలో జనసైనికులు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి అందరికీ తెలిసినదే. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 18 అసెంబ్లీ సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నెరవేర్చాడు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న సంగతి విదితమే.

అయితే ఆయన క్రియాశీలకంగా లేరనే చెప్పుకోవాలి. అందుకే ఆయన ఇపుడు ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ+టీడీపీ+జనసేనలకు ఆయన వంతు మద్దతు తెలుపుతున్నారు. దాంతో కాంగ్రెస్ లో ఉంటూ ఎన్డీయే కూటమిని ఎలా సపోర్ట్ చేస్తారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇకపోతే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పి రమేష్ బాబులకు ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి ఒక వీడియో క్లిప్ విడుదల చేసిన సంగతి తెలిసినదే. తాజాగా ఇపుడు చిరంజీవి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>