MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr432ce0a4-465e-4d78-a42f-92e0590e711b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr432ce0a4-465e-4d78-a42f-92e0590e711b-415x250-IndiaHerald.jpgదీపక్ సరోజ్ , తన్వి నేగి , నందిని ప్రధాన పాత్రలలో వి. యశస్వీ దర్శకత్వంలో "సిద్ధార్థ్ రాయ్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 వ తేదీ న థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అర్జున్ రెడ్డి సినిమాను పోలి ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి , విమర్శకుల sr{#}Tanvi;Arjun Reddy;cinema theater;Cinema;Box office;February;Posters"సిద్ధార్థ్ రాయ్" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!"సిద్ధార్థ్ రాయ్" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!sr{#}Tanvi;Arjun Reddy;cinema theater;Cinema;Box office;February;PostersTue, 30 Apr 2024 23:57:00 GMTదీపక్ సరోజ్ , తన్వి నేగి , నందిని ప్రధాన పాత్రలలో వి. యశస్వీ దర్శకత్వంలో "సిద్ధార్థ్ రాయ్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 వ తేదీ న థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అర్జున్ రెడ్డి సినిమాను పోలి ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఇక ఈ మూవీ చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రేక్షకులను అలరించడంలో బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ వారు దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాని మే 3 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>