PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishnab47d29bd-b2ad-4a8d-920e-25b1e1e9316d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishnab47d29bd-b2ad-4a8d-920e-25b1e1e9316d-415x250-IndiaHerald.jpgటీడీపీలో బాగా పాపులారిటీ ఉన్న నేత ఎవరైనా ఉన్నారా అంటే మనకు ముందుగా నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తారు. చంద్రబాబు సమావేశాల కంటే బాలకృష్ణ పెట్టే సమావేశాలకే ప్రజలు ఎక్కువగా వస్తారని అనడంలో సందేహం లేదు. బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ అభిమానులకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ అభిమానులే కాకుండా కూడా సినిమా అభిమానులు కూడా బాలయ్య బాబు వెంటే ఉంటారు. ఈ హీరోకి ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే ఆయన ప్రచారాలకు వెళ్తే జనాలు ఎగబడి వస్తారు. అలాంటి బాలకృష్ణకు ఎల్లో మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఈసారి ఆయనను చాలా లైBalakrishna{#}NTR;Mass;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;Father;Cinema;Hanu Raghavapudi;Sharmila;CBN;media;Partyఏపీ: బాలకృష్ణను పట్టించుకోని ఎల్లో మీడియా.. ఎందుకలా..?ఏపీ: బాలకృష్ణను పట్టించుకోని ఎల్లో మీడియా.. ఎందుకలా..?Balakrishna{#}NTR;Mass;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;Father;Cinema;Hanu Raghavapudi;Sharmila;CBN;media;PartyTue, 30 Apr 2024 19:03:00 GMTటీడీపీలో బాగా పాపులారిటీ ఉన్న నేత ఎవరైనా ఉన్నారా అంటే మనకు ముందుగా నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తారు. చంద్రబాబు సమావేశాల కంటే బాలకృష్ణ పెట్టే సమావేశాలకే ప్రజలు ఎక్కువగా వస్తారని అనడంలో సందేహం లేదు. బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ అభిమానులకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ అభిమానులే కాకుండా కూడా సినిమా అభిమానులు కూడా బాలయ్య బాబు వెంటే ఉంటారు. ఈ హీరోకి ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే ఆయన ప్రచారాలకు వెళ్తే జనాలు ఎగబడి వస్తారు. అలాంటి బాలకృష్ణకు ఎల్లో మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఈసారి ఆయనను చాలా లైట్ తీసుకుంటున్నాయి.

 2019 ఎన్నికల సమయంలో బాలకృష్ణ ప్రచారాలకు సంబంధించిన స్టోరీలను ఫ్రంట్ పేజీలో అందరికీ కనిపించేలా పెద్దగా ప్రచురించేవారు కానీ ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా వర్గాలు బాలకృష్ణ గురించి ఆశించిన స్థాయిలో న్యూస్ రాయడం లేదు, న్యూస్ చెప్పడం లేదు. పేపర్లలో ఏదో ఒక మూలన బాలకృష్ణ ప్రచారం గురించి ప్రచురిస్తున్నాయి. వైఎస్ షర్మిల స్టోరీలను మాత్రం ఫ్రంట్ పేజీలో చాలా గొప్పగా హైలెట్ చేస్తున్నాయి.

బాలకృష్ణను ఈసారి ఎందుకు ఇలా తక్కువ చేసి చూపిస్తున్నారనేదానికి కారణం మాత్రం తెలియ రాలేదు. లోకేష్ గురించి కూడా తక్కువగానే చూపిస్తున్నారు. వారి గురించి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయన ఏం చెబితే అదే చేస్తాయి ఎల్లో మీడియా సంస్థలు. కానీ దీనివల్ల ఆయనకు లభించేది ఏంటి అనేది తెలియ రావడం లేదు. ఎవరినో సంతోష పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా బాలకృష్ణ తన తండ్రి ద్వారా వచ్చిన అభిమానంతో పాటు సొంతంగా సంపాదించిన పాపులారిటీతో పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు. ఆయనను చులకనగా తక్కువగా చేసి ఎల్లో మీడియా తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు చాలామంది ఫైర్ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>