Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/panth93411017-956a-46c2-b6c5-cd362374b7f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/panth93411017-956a-46c2-b6c5-cd362374b7f6-415x250-IndiaHerald.jpgజూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత జట్టులోకి ఎవరు సెలెక్ట్ కాబోతున్నారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే తమ అభిమాన క్రికెటర్లు సెలెక్ట్ కావాలని ఏకంగా ఫ్యాన్స్ అందరూ కూడా పూజలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈసారి ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది ఆటగాళ్ళు అదరగొడుతున్నారు. ఇప్పటికే భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు మాత్రమే కాదు కొత్Panth{#}Rishabh Pant;World Cup;Hardik Pandya;Rohit Sharma;ICC T20;Yevaruవరల్డ్ కప్ లో.. వైస్ కెప్టెన్ గా పాండ్యా కాదు ఎవరంటే?వరల్డ్ కప్ లో.. వైస్ కెప్టెన్ గా పాండ్యా కాదు ఎవరంటే?Panth{#}Rishabh Pant;World Cup;Hardik Pandya;Rohit Sharma;ICC T20;YevaruTue, 30 Apr 2024 14:00:00 GMTజూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత జట్టులోకి ఎవరు సెలెక్ట్ కాబోతున్నారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే తమ అభిమాన క్రికెటర్లు సెలెక్ట్ కావాలని ఏకంగా ఫ్యాన్స్ అందరూ కూడా పూజలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈసారి ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది ఆటగాళ్ళు అదరగొడుతున్నారు. ఇప్పటికే భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు మాత్రమే కాదు కొత్తగా ఐపీఎల్లోకి ఎంటర్ ఇచ్చిన ప్లేయర్లు సైతం తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు.


 దీంతో ఎవరికి టి20 వరల్డ్ కప్ లో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇదే విషయం గురించి ఎంతోమంది మాజీ ప్లేయర్లు కూడా స్పందిస్తూ.. ఇక తమ అభిప్రాయం ప్రకారం వరల్డ్ కప్ టీంలో ఎవరు ఉంటారు అనే విషయంపై రివ్యూలు ఇవ్వడం కూడా చేశారు. అయితే కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండగా ఇక వైస్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఇక ఇప్పుడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతని స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకొని వైస్ కెప్టెన్సీ ఇస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది  


 అయితే t20 వరల్డ్ కప్ జట్టులో అసలు చోటు దక్కుతుందా లేదా అని ఆలోచిస్తున్న ప్లేయర్ కూ ఏకంగా వైస్ కెప్టెన్సీ కూడా దక్కబోతుందట. అతను ఎవరో కాదు.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత.. ఇటీవల ipl లోకి వచ్చి అదరగొడుతున్న రిషబ్ పంత్ కి వైస్ కెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని క్రిక్ బజ్ తెలిపింది  ఈ లీడర్షిప్ రోల్ కోసం అతను పాండ్యతో పోటీ పడుతున్నాడని తెలిపింది. అయితే ప్రస్తుతం ఐపిఎల్ లో బ్యాటింగ్, కీపింగ్ లో కూడా రిషబ్ పంత్ రానిస్తున్నాడు. ఇంకోవైపు హార్దిక్ పాండ్యా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెలెక్టర్లు టి20 వరల్డ్ కప్ జట్టులోకి పంత్ ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ అప్పగించడం ఖాయం అని క్రిక్బజ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>