Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etu-chusina-ayanake-kalisi-vachela-unde-af2c49b8-e359-4cf9-b333-ae58941ddd7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etu-chusina-ayanake-kalisi-vachela-unde-af2c49b8-e359-4cf9-b333-ae58941ddd7d-415x250-IndiaHerald.jpgపార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ అధికారం కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధమే నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇప్పుడు కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ అనుకుంటుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బిఆర్ఎస్ ధీమాతో ఉంది. ముఖ్యంగా ఖమ్మంలో విజయంపై రెండు పార్టీలు స్పెషల్ ఫొటోస్ పెట్టాయ్. ఇక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి పోరు జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిCongress{#}Purighalla Raghuram;Akkineni Nageswara Rao;Deputy Chief Minister;Khammam;revanth;Bharatiya Janata Party;Success;Parliment;srinivas;Congress;Minister;Assembly;Party;Reddy;Kammaఖమ్మంలో కమ్మ vs రెడ్డి.. ఎటు చూసిన ఆయనకే కలిసొస్తుందే?ఖమ్మంలో కమ్మ vs రెడ్డి.. ఎటు చూసిన ఆయనకే కలిసొస్తుందే?Congress{#}Purighalla Raghuram;Akkineni Nageswara Rao;Deputy Chief Minister;Khammam;revanth;Bharatiya Janata Party;Success;Parliment;srinivas;Congress;Minister;Assembly;Party;Reddy;KammaTue, 30 Apr 2024 11:45:00 GMTకాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధమే నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇప్పుడు కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ అనుకుంటుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బిఆర్ఎస్ ధీమాతో ఉంది. ముఖ్యంగా ఖమ్మంలో విజయంపై రెండు పార్టీలు స్పెషల్ ఫొటోస్ పెట్టాయ్. ఇక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి పోరు జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురాం రెడ్డి బరిలో నిలిచారు.


 బిఆర్ఎస్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న నామా నాగేశ్వరరావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. బిజెపి నుంచి తాండ్ర వినోద్ రావులు పోటీలో ఉండగా ఇకఅసలు పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య అన్నది తెలుస్తుంది. గెలుపు కోసం ఎవరికి వారు ఎత్తులు  పైఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడు మాత్రమే కాకుండా.. రెవిన్యూ మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ ఎమ్మెల్యేలే ఉండడం ఇక హస్తం పార్టీకి అదనపు బలంగా మారే అంశం.



 అంతేకాదు ఇక ఖమ్మం జిల్లా నుంచి ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇక అసెంబ్లీలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక పటిష్టమైన కాంగ్రెస్ క్యాడర్ అటు బిఆర్ఎస్ బిజెపి పార్టీల నెగిటివ్స్ ను చెబుతూ ఆయా పార్టీలపై వ్యతిరేకత తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే పట్టుబట్టి మరీ తన వియ్యంకుడు తన రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించుకున్న పొంగులేటి ఆయన విజయం బాధ్యతలను కూడా భుజానా వేసుకున్నాడు అని తెలుస్తోంది.


అయితే బిఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు అంగ బలం అర్ద బలం ఉన్నప్పటికీ.. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకతకు కారడమైంది. మరోవైపు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్  పరిధిలో ఎక్కడ కూడా బిఆర్ఎస్ ఆనవాళ్లు లేవు. ఇంకోవైపు అటు మునుపటిలా రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో  కూడా లేదు. అయితే బిఆర్ఎస్ కీలక నేత వద్దిరాజు రవిచంద్ర.. నామా నాగేశ్వరరావు ప్రచార బాధ్యతలను భుజాలు వేసుకొని ముందుకు సాగుతున్నారు. మరోవైపు కమలం పార్టీ నుంచి బరిలోకి దిగిన తాండ్ర వినోద్ రావు అటు ఆర్థికంగా బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఖమ్మంలో బీజేపీకి సరైన క్యాడర్ లేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది.ఇలా ఖమ్మంలో రాజకీయ పరిణామాలు చూస్తే ఎట్టుచూసిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి కే ఎక్కువగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అని చెప్పాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>