PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-jansena-bjp-chandrbabu-pawan-modi-manipost1f493977-e51a-4e53-88f6-f17b50b4006a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-jansena-bjp-chandrbabu-pawan-modi-manipost1f493977-e51a-4e53-88f6-f17b50b4006a-415x250-IndiaHerald.jpgటిడిపి బిజెపి జనసేన పార్టీ కూటమిలో భాగంగా మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయబోతున్నారు.. అయితే ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే విషయం పైన ఇప్పటికే చల చర్చలు జరిపారు పలువురు నేతలు.. అలాగే సూపర్ సిక్స్ హామీల పథకాలకు మరికొన్ని యాడ్ చేసే విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందంటూ గతంలో కూడా తెలియజేశారు. వైసిపి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.. గత మేనిఫెస్టోలో కూడా తాము 99 శాతం అమలు చేశామని ఈసారి 100% అమలు చేస్తామని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు పలువురు నేతలు పదే పదే తెలియజేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబTDP;JANSENA;BJP;CHANDRBABU;PAWAN;MODI;MANIPOST{#}Reddy;bus;CM;CBN;Bharatiya Janata Party;YCP;TDP;Partyటీడీపి: ఈ రోజే మేనిఫెస్టో.. ఈసారి నమ్ముతారా..?టీడీపి: ఈ రోజే మేనిఫెస్టో.. ఈసారి నమ్ముతారా..?TDP;JANSENA;BJP;CHANDRBABU;PAWAN;MODI;MANIPOST{#}Reddy;bus;CM;CBN;Bharatiya Janata Party;YCP;TDP;PartyTue, 30 Apr 2024 07:49:22 GMTటిడిపి బిజెపి జనసేన పార్టీ కూటమిలో భాగంగా మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయబోతున్నారు.. అయితే ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే విషయం పైన ఇప్పటికే చల చర్చలు జరిపారు పలువురు నేతలు.. అలాగే సూపర్ సిక్స్ హామీల పథకాలకు మరికొన్ని యాడ్ చేసే విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందంటూ గతంలో కూడా తెలియజేశారు.  వైసిపి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.. గత మేనిఫెస్టోలో కూడా తాము 99 శాతం అమలు చేశామని ఈసారి 100% అమలు చేస్తామని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు పలువురు నేతలు పదే పదే తెలియజేస్తున్నారు.



 టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన మేనిఫెస్టోపైన ప్రజలలో విశ్వాసం కలిగించేలా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈసారి మేనిఫెస్టోని చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.. చెప్పేవన్నీ కూడా చేస్తామంటూ ప్రజల వద్దకు వెళుతున్నారు. కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోని విడుదల చేయగా అందులో కొన్ని వర్గాలకు మాత్రమే మేనిఫెస్టో ఉన్నది. ముఖ్యంగా మహిళ ఓట్లు కీలకంగా భావించిన చంద్రబాబు వారి ఓట్లను రాబట్టుకొనేకే సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. ప్రతి 18 ఏళ్లు నిండిన మహిళకు 1500 రూపాయలు నెల నెల ఇస్తామంటూ తెలుపుతున్నారు.


చంద్రబాబు నాయుడు వస్తే కచ్చితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువత భావిస్తున్నట్టుగా పదేపదే టిడిపి నేతలు చంద్రబాబుకు ఈ విషయంపై చెబుతున్నారట. అంతేకాకుండా ఈసారి యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని అంతవరకు ప్రతి ఒక్కరికి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామంటూ చంద్రబాబు ఇప్పటికే తెలిపారు.. అలాగే రైతులకు తల్లికి వందనం పేరిట పలు రకాల పథకాలను కూడా ఇటీవలే ప్రకటించారు. అలాగే పింఛన్ 4000 రూపాయలు పెంచుతామంటూ కూడా తెలిపారు. వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామంటూ తెలిపారు.



ఈ రోజున కూటమి తరపున మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. వైసీపీ మేనిఫెస్టో ని మించి చంద్రబాబు ఈ రోజున ఉండవల్లిలో తన నివాసంలో మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వెనుకబడిన వర్గాలకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక్కడ సమస్య ఏమిటంటే మేనిఫెస్టో విడుదలవుతుంది..కానీ జనం దీనిని ఎంతవరకు నమ్ముతారనేది.. ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. తన పైన నమ్మకం ఉంచాలని తాను చెప్పిన మాటలను తప్పకుండా చేస్తానంటూ ఎన్నికలలో ఊదర  గోడుతున్నారు చంద్రబాబు. మరి చంద్రబాబు మాటలు జనం నమ్ముతారా లేదా అనే విషయం తెలియాలి అంటే ఫలితాల వరకు ఆగాల్సిందే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>