Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap775fd10b-9268-4892-adba-2e0cea40e95c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap775fd10b-9268-4892-adba-2e0cea40e95c-415x250-IndiaHerald.jpgఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఇక అధికారంలో ఉన్న జగన్ పార్టీని ఓడించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మాదే విజయం అంటే మాదే విజయం అంటూ అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించే విధంగా కొన్ని సర్వేలు సంచలనమే సృష్టిస్తAp{#}praveen;Survey;Parliment;Congress;Janasena;Party;Andhra Pradesh;YCP;Assembly;Jagan;CBN;TDPసంచలనం రేపుతున్న సర్వే రిపోర్ట్.. ఏపీలో కూటమిదే విజయమట?సంచలనం రేపుతున్న సర్వే రిపోర్ట్.. ఏపీలో కూటమిదే విజయమట?Ap{#}praveen;Survey;Parliment;Congress;Janasena;Party;Andhra Pradesh;YCP;Assembly;Jagan;CBN;TDPTue, 30 Apr 2024 17:38:00 GMTఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఇక అధికారంలో ఉన్న జగన్ పార్టీని ఓడించేందుకు  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి  ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మాదే విజయం అంటే మాదే విజయం అంటూ అన్ని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించే విధంగా కొన్ని సర్వేలు సంచలనమే సృష్టిస్తున్నాయి అని చెప్పాలి.


 కొన్ని సర్వేలు టిడిపి కూటమి గెలుస్తుంది అని చెబుతుంటే.. మరికొన్ని సర్వేలు ఇక గత అసెంబ్లీ ఎన్నికల లాగానే ఈసారి కూడా అటు వైసిపి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది. మరోసారి అధికారాన్ని చేపడుతుంది అని చెబుతున్నాయ్. అయితే ఇక ఇప్పుడు మరో సర్వే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. రైజ్ సర్వే సంస్థ ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆదిక్యత సాధిస్తుంది అన్న విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ నిర్వాహకుడు పుల్లట ప్రవీణ్ ఇటీవల వెల్లడించిన ఫలితాల ప్రకారం.. కూటమి పార్టీ దాదాపు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలుచుకోపోతుందట.


 మరోవైపు ప్రస్తుతము అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 41 నుంచి 51 స్థానాలలోపే పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదాని సంపాదించుకుంటుందని.. ఇక ఈ సర్వే సంస్థ చెబుతుంది. అయితే ఏపీలోనే 43 అసెంబ్లీ స్థానాలలో మాత్రం అటు కూటమికి అధికార వైసీపీకి మధ్య హోరాహోరీ పోరు జరగనుందని సర్వే రిపోర్ట్ చెబుతూ ఉండడం గమనార్హం. ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతుందట. ఇక రాయలసీమలో మినహా మిగతా అన్ని రీజన్లలోనూ కూటమి ఆదిక్యం ప్రదర్శిస్తుందని.. సర్వే రిపోర్ట్ చెబుతూ ఉంది. ఇక లోక్సభ స్థానాల్లో కూడా కూటమికి అత్యధికంగా 18 స్థానాలు దక్కి అవకాశం ఉన్నాయని రైజ్ సర్వే సంస్థ వెల్లడించింది. ఏం జరగాలన్నది మాత్రం పూర్తిగా నిర్ణయించేది ఓటర్లే. ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>