PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan2f4eb32d-d12f-4a01-ac20-d98d65e6c4f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan2f4eb32d-d12f-4a01-ac20-d98d65e6c4f0-415x250-IndiaHerald.jpgఎన్నికల ప్రణాళిక అంటే ఉచితాల మీద ఉచితాలు అన్న చందంగా తయారైంది. ఎవరు ఎక్కువ హామీలు ఇస్తారు. ఏ పార్టీ ఎక్కువ ఉచితాలు ప్రకటిస్తారు అన్నది వేలం పాటగా మారింది. అయితే 2019లో జగన్ నవరత్నాల పేరిట చాలా హామీలనే ప్రకటించారు. వాటిని అమలు చేయడానికి ఏపీని అప్పుల మయం చేశారనే విమర్శ ఉంది. అయిదేళ్ల జగన్ పాలనలో ఏకంగా ప్రత్యక్షంగా రెండు లక్షల కోట్ల రూపాయల నగదు, అలాగే పరోక్షంగా మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయల నగదును అందించారు. ఇదే ఏపీ అప్పుల కుప్పగా మారడానికి ప్రధాన కారణం అయింది. అయితే ప్రస్తుత సీఎంగా జగన్ మోహjagan{#}Party;CM;Yevaru;Andhra Pradesh;Jaganఇవేం లెక్కలు.. మేనిఫెస్టో జగన్ మాయ చేశారా..?ఇవేం లెక్కలు.. మేనిఫెస్టో జగన్ మాయ చేశారా..?jagan{#}Party;CM;Yevaru;Andhra Pradesh;JaganTue, 30 Apr 2024 09:05:44 GMTఎన్నికల ప్రణాళిక అంటే ఉచితాల మీద ఉచితాలు అన్న చందంగా తయారైంది. ఎవరు ఎక్కువ హామీలు ఇస్తారు.  ఏ పార్టీ ఎక్కువ ఉచితాలు ప్రకటిస్తారు అన్నది వేలం పాటగా మారింది. అయితే 2019లో జగన్ నవరత్నాల పేరిట చాలా హామీలనే ప్రకటించారు. వాటిని అమలు చేయడానికి ఏపీని అప్పుల మయం చేశారనే విమర్శ ఉంది.


అయిదేళ్ల జగన్ పాలనలో ఏకంగా ప్రత్యక్షంగా రెండు లక్షల కోట్ల రూపాయల నగదు, అలాగే పరోక్షంగా మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయల నగదును అందించారు. ఇదే ఏపీ అప్పుల కుప్పగా మారడానికి ప్రధాన కారణం అయింది. అయితే ప్రస్తుత సీఎంగా జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఖజానాపై పూర్తి అంచనా ఉంది. అందుకే హంగులూ, ఆర్భాటాలకు పోకుండా ఎవరికీ అర్థం కాకుండా తమ మ్యానిఫెస్టోని విడుదల చేశారు.


గతంలో కూడా రూ.3వేల పింఛన్ అని తీరా చూస్తే ఏడాదికి రూ.250 చొప్పున మాత్రమే పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు కూడా పెంచుతా అన్నారు కానీ వీటిని ఏ విధంగా అందిస్తారో పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. చేయూత రూ.75 నుంచి రూ.లక్షన్నర వరకు పెంచుతా అన్నారు. అంటే ఏడాదికి రూ.30 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈబీసీ నేస్తం రూ. 45 వేల నుంచి రూ.1.05లక్షలు చేస్తా అన్నారు. అంటే ఈ పథకాన్ని రెండేళ్ల తర్వాత అమలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఐదేళ్ల కాలానికి ఈ అమౌంట్ ని లెక్కకట్టారా అనేది అర్థం కావడం లేదు.


కాపు నేస్తం రూ.60వేల నుంచి రూ.లక్షా 20 వేలు అన్నారు. దీనిని కూడా ఏడాది తర్వాత అమలు చేశారు. ఇప్పుడు మొత్తం కలుపుకొని రూ.లక్షా ఇరవై వేలా లేక.. ఈ ఏడాదికి ఇంత మొత్తమా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అలాగే మిగిలిన పథకాలు గతంలో ఇచ్చినవి కలిపి పెంచినట్లా.. లేక ఈ ఏడాది నుంచి పెంచినవి అమలు చేస్తారా అనేది సీఎం జగన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>