MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajithd22ef3ff-ffb3-4154-bc5d-7a5920107a08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajithd22ef3ff-ffb3-4154-bc5d-7a5920107a08-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే మే 1 వ తేదీన అజిత్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక అజితajith{#}Shiva;ajith kumar;tara;Tollywood;Blockbuster hit;lord siva;Ajit Pawar;cinema theater;Telugu;Cinema;Success;Hero;Tamilఅజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆ నాలుగు మూవీలో రీ రిలీస్..!అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆ నాలుగు మూవీలో రీ రిలీస్..!ajith{#}Shiva;ajith kumar;tara;Tollywood;Blockbuster hit;lord siva;Ajit Pawar;cinema theater;Telugu;Cinema;Success;Hero;TamilTue, 30 Apr 2024 23:49:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే మే 1 వ తేదీన అజిత్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన కొన్ని సినిమాలను మళ్లీ థియేటర్ లను రీ రిలీస్ చేయబోతున్నారు. మరి మే 1 వ తేదీన అజిత్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ కాబోయే సినిమాలు ఏవో తెలుసుకుందాం. అజిత్ కొంత కాలం క్రితం బిల్లా అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాని మే 1 వ తేదీన అనేక ప్రాంతాల్లో రీ రిలీజ్ చేయనున్నారు. అలాగే అజిత్ హీరోగా రూపొందిన ధీర మూవీ ని కూడా మే 1 వ తేదీన రీ రిలీస్ చేయనున్నారు. ఇక అజిత్ హీరో గా నయన తార హీరోయిన్ గా శివ దర్శకత్వంలో రూపొందిన విశ్వాసం మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. అలాగే మంకత్త మూవీ ని కూడా రీ రిలీస్ చేయనున్నారు. కాకపోతే ఈ సినిమాను కేవలం ఓవర్ సీస్ లో మాత్రమే రీ రిలీస్ చేయనున్నారు. ఇలా అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన నాలుగు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>