PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-is-it-difficult-for-tdp-in-these-seats3ab85f76-60a0-46c1-9507-2c672bd4bb87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-is-it-difficult-for-tdp-in-these-seats3ab85f76-60a0-46c1-9507-2c672bd4bb87-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మరిన్ని అదిరిపోయే హామీలను అమలు చేసేలా కూటమి మేనిఫెస్టో ఉంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని బాబు హామీ ఇచ్చారు. రైతులకు ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సహాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. chandrababu naidu{#}CBN;Vaddera;electricity;job;geetha;bus;TDPకూటమిని విజయ తీరాలకు చేర్చే అద్భుత హామీలివే.. ఓటర్ల రెస్పాన్స్ ఇదే!కూటమిని విజయ తీరాలకు చేర్చే అద్భుత హామీలివే.. ఓటర్ల రెస్పాన్స్ ఇదే!chandrababu naidu{#}CBN;Vaddera;electricity;job;geetha;bus;TDPTue, 30 Apr 2024 15:47:00 GMTమాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మరిన్ని అదిరిపోయే హామీలను అమలు చేసేలా కూటమి మేనిఫెస్టో ఉంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని బాబు హామీ ఇచ్చారు. రైతులకు ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సహాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
 
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందజేస్తామని బాబు చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని దీపం స్కీమ్ కింద మహిళలకు 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని వెల్లడించారు.
 
నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మెగా డీఎస్సీ ప్రకటించడంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమలు చేస్తామని ఆయన తెలిపారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తామని చంద్రబాబు వెల్లడించారు.
 
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని పవర్  లూమ్ లకు 500 యూనిట్లకు, హ్యాండ్లూమ్ లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. గీత కార్మికులకు, వడ్డెర కులస్తులకు బెనిఫిట్ కలిగించేలా బాబు హామీలను ప్రకటించారు. స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బాబు వెల్లడించారు. కూటమి హామీలపై ఓటర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>