PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-vs-ycp-who-gets-the-majority27392d69-dda6-4ab5-a607-71d86862750b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-vs-ycp-who-gets-the-majority27392d69-dda6-4ab5-a607-71d86862750b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరువూరు నియోజకవర్గం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇక్కడి నుండి గెలవడానికి ప్రధాన పార్టీలు ఎప్పుడు భారీగానే పోటీ పడుతూ ఉంటాయి. ఇక పోయినసారి ఇక్కడి నుండి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కొత్త‌ప‌ల్లి సామ్యేల్ జ‌వ‌హార్ పోటీ చేయగా ... వైసీపీ పార్టీ నుండి కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ నిధి బరిలోకి దిగింది. ఇందులో కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ నిధి తన సమీప అభ్యర్థి అయినటువంటి కొత్త‌ప‌ల్లి సామ్యేల్ జ‌వ‌హార్ పై 10,835 మెజారిటీతో గెలుపొందింది. ఇక పోయిన సారి ఈమె బారి మెజారిటీతో గెలుపొందడంతtiruvur{#}nidhi;Bari;Tiruvuru;Nenu Local;srinivas;YCP;TDP;local languageతిరువూరు : లోకల్ వర్సెస్ నాన్ లోకల్... చివరికి జరిగేది అదేనా..!తిరువూరు : లోకల్ వర్సెస్ నాన్ లోకల్... చివరికి జరిగేది అదేనా..!tiruvur{#}nidhi;Bari;Tiruvuru;Nenu Local;srinivas;YCP;TDP;local languageTue, 30 Apr 2024 08:02:25 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరువూరు నియోజకవర్గం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇక్కడి నుండి గెలవడానికి ప్రధాన పార్టీలు ఎప్పుడు భారీగానే పోటీ పడుతూ ఉంటాయి. ఇక పోయినసారి ఇక్కడి నుండి టీడీపీ పార్టీ అభ్యర్థిగా కొత్త‌ప‌ల్లి సామ్యేల్ జ‌వ‌హార్ పోటీ చేయగా ... వైసీపీ పార్టీ నుండి కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ నిధి బరిలోకి దిగింది. ఇందులో కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ నిధి తన సమీప అభ్యర్థి అయినటువంటి కొత్త‌ప‌ల్లి సామ్యేల్ జ‌వ‌హార్ పై 10,835 మెజారిటీతో గెలుపొందింది. ఇక పోయిన సారి ఈమె బారి మెజారిటీతో గెలుపొందడంతో ఈ సారి కూడా వైసీపీ పార్టీ నుండి రక్షణ నిధి కే సీటు దక్కుతుంది అని అంతా అనుకున్నారు.

కాకపోతే అనూహ్యంగా ఈ సారి ఈ ప్రాంత సీటును నల్లగుట్ట స్వామి దాస్ దక్కించుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్ ఈ ప్రాంతం నుండి బరిలోకి దిగబోతున్నాడు. వీరిద్దరికీ కూడా ఈ ప్రాంత సీట్ దాదాపు నెల రోజుల క్రితమే కన్ఫామ్ అయ్యింది. దానితో వీరిద్దరూ ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రచారాలను చేయడం మాత్రమే కాకుండా ఒకరిపై ఒకరు విమర్శలను కూడా చేసుకుంటూ వెళుతున్నారు. వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి స్వామి దాస్ నేను లోకల్ ఇక్కడే ఉంటాను, గెలిచిన ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, అందుకే ఇక్కడ ప్రజలు నన్నే నమ్ముతారు, నాకే ఓటు వేస్తారు అని చెప్తున్నాడు. అలాగే కొలికపూడి శ్రీనివాస్ ఈ ప్రాంత వ్యక్తి కాదు.

అతనిని ఎక్కడి నుండో తీసుకువచ్చి ఇక్కడ సీటు ఇచ్చారు. ఆయనకు ఇక్కడి ప్రాంత కార్యకర్తలు కూడా తెలియదు. వారికి కూడా ఇతను ఎవరో తెలియదు. దానితో ఇతన్ని ఇక్కడి ప్రజలు అస్సలు నమ్మరు. అందుకే నాకే విజయ అవకాశాలు ఎక్కువ అని ఈయన చెబుతూ వస్తున్నాడు. ఇక శ్రీనివాస్ నాది నాన్ లోకల్ అయినప్పటికీ నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి ప్రజలతోనే జీవిస్తాను. నన్ను గెలిపించండి అని ప్రచారాన్ని చేస్తున్నాడు. ఇక దీనితో ఇక్కడి ప్రజలు లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్లలో ఎవరి సైడు నిలబడాలో అనే విషయంలో తర్జన భర్జన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ లోకల్ కాండెడ్ కావడంతో స్వామి దాస్ కి కాస్త ఎడ్జ్ ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>