PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagans-manifesto-vs-babus-super-sixa7a28dc4-f165-4162-b7ff-224c4e247e84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagans-manifesto-vs-babus-super-sixa7a28dc4-f165-4162-b7ff-224c4e247e84-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకుంటారా? లేక కూటమిని గెలిపించుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ ఎన్నికల్లో నమ్మకం నమ్మకద్రోహం మధ్య యుద్ధం జరగనుందని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు 10 హామీలు ఇస్తే వాటిలో ఒక హామీని మాత్రమే అమలు చేస్తారని వైసీపీ నేతలు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. jagan{#}Survey;war;Andhra Pradesh;CBN;Jagan;YCP;June;Electionsనమ్మకం నమ్మకద్రోహం మధ్య యుద్ధం.. బాబును జగన్ గట్టిగానే ఇరికించారుగా?నమ్మకం నమ్మకద్రోహం మధ్య యుద్ధం.. బాబును జగన్ గట్టిగానే ఇరికించారుగా?jagan{#}Survey;war;Andhra Pradesh;CBN;Jagan;YCP;June;ElectionsMon, 29 Apr 2024 11:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకుంటారా? లేక కూటమిని గెలిపించుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ ఎన్నికల్లో నమ్మకం నమ్మకద్రోహం మధ్య యుద్ధం జరగనుందని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు 10 హామీలు ఇస్తే వాటిలో ఒక హామీని మాత్రమే అమలు చేస్తారని వైసీపీ నేతలు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు.
 
జగన్ ప్రతి బహిరంగ సభలో బాబు 2014 ఎన్నికల్లో ప్రకటించిన హామీలను వాటిని అమలు చేయని తీరును ప్రస్తావిస్తూ చంద్రబాబుకు షాకులిస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలు తక్కువే అయినా ప్రతి హామీని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా అమలు చేస్తాననే నమ్మకాన్ని కలిగించడంలో సఫలమయ్యారు. అటు బాబు పాలన, ఇటు జగన్ పాలనను ఏపీ ప్రజలు ఇప్పటికే చూసేశారు.
 
ఇద్దరి పాలనలో ఎవరి పాలన ఏ విధంగా ఉండనుందో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. వైసీపీ మేనిఫెస్టోపై మెల్లగా ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతోంది. జగన్ తన మేనిఫెస్టోను ఎలాంటి సందేహాలకు, అనుమానాలకు తావు లేకుండా ప్రకటించడం గమనార్హం. ఏ స్కీమ్ ను ఎన్ని విడతలలో అమలు చేయాలని అనుకుంటున్నారో క్లారిటీగా చెప్పేశారు.
 
ఇక ఏ పార్టీకి ఓటేయాలో తేల్చుకోవడం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. కూటమి గెలిచినా వైసీపీ గెలిచినా పెద్ద తేడా ఉండదని భావిస్తున్న ఓటర్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో సర్వేలకు సైతం అంతుచిక్కడం లేదు. ఇప్పటివరకు వెలువడిన సర్వే ఫలితాలలో మెజారిటీ సర్వే ఫలితాలు తూతూమంత్రంగా ప్రకటించనవే కావడం గమనార్హం. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండగా ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. జగన్, చంద్రబాబులలో ఎవరికి లక్ కలిసొస్తుందో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>