MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pokiri--mahesh-babu27d11250-8a69-4b35-88d0-93a8411f709d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pokiri--mahesh-babu27d11250-8a69-4b35-88d0-93a8411f709d-415x250-IndiaHerald.jpgఅప్పటి దాకా ప్రిన్స్ అంటూ పిలుచుకునే మహేష్ బాబుకి తన తండ్రి కృష్ణ గారి సూపర్ స్టార్ ట్యాగ్ ను కట్టబెట్టిన సినిమా 'పోకిరి'. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజుల డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మించింది.పైగా కేవలం 108 రోజుల్లో తీసిన మూవీ ఇది. అప్పట్లో ఫాస్ట్ గా తీసిన మూవీ ఇదే. పైగా ఆ టైంకి పూరి జగన్నాథ్ ఫామ్లో లేడు. వరుస ప్లాపుల్లో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో నాగార్జున తో తీసిన ‘సూపర్” పెద్దగా ఆడలేక ప్లాప్ గా మిగిలింది.అలాగే ఆ సినిమాకి ముందు పూరి తన Pokiri - Mahesh Babu{#}prince;Remake;Pokiri;Sandal wood;Tammudu;Thammudu;bollywood;Rajani kanth;Audience;history;puri jagannadh;Akkineni Nagarjuna;manjula;mahesh babu;Balakrishna;Industry;krishna;kalyan;Kollywood;Director;Cinema;Indian;ram pothineni;Fatherపోకిరి: చరిత్రలో బెస్ట్ ఇండస్ట్రీ హిట్?పోకిరి: చరిత్రలో బెస్ట్ ఇండస్ట్రీ హిట్?Pokiri - Mahesh Babu{#}prince;Remake;Pokiri;Sandal wood;Tammudu;Thammudu;bollywood;Rajani kanth;Audience;history;puri jagannadh;Akkineni Nagarjuna;manjula;mahesh babu;Balakrishna;Industry;krishna;kalyan;Kollywood;Director;Cinema;Indian;ram pothineni;FatherMon, 29 Apr 2024 17:31:16 GMTఅప్పటి దాకా ప్రిన్స్ అంటూ పిలుచుకునే మహేష్ బాబుకి తన తండ్రి  కృష్ణ గారి సూపర్ స్టార్ ట్యాగ్ ను కట్టబెట్టిన సినిమా 'పోకిరి'. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజుల డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మించింది.పైగా కేవలం 108 రోజుల్లో తీసిన మూవీ ఇది. అప్పట్లో ఫాస్ట్ గా తీసిన మూవీ ఇదే. పైగా ఆ టైంకి పూరి జగన్నాథ్ ఫామ్లో లేడు. వరుస ప్లాపుల్లో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో నాగార్జున తో తీసిన ‘సూపర్” పెద్దగా ఆడలేక ప్లాప్ గా మిగిలింది.అలాగే ఆ సినిమాకి ముందు పూరి తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ని పరిచయం చేస్తూ అతనితో తీసిన ‘143’ కూడా ప్లాప్ అయింది.సో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వచ్చాయి. అయినా కానీ మహేష్ బాబు పూరికి అవకాశం ఇచ్చాడు.అలాంటి టైంలో అంటే 2006 ఏప్రిల్ 28 న వచ్చిన ‘పోకిరి’ మూవీపై మొదట ప్రేక్షకుల్లో అంచనాలే లేవు.మరోపక్క బాలకృష్ణ  ‘వీరభద్ర’ , పవన్ కళ్యాణ్  ‘బంగారం’  వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని ‘పోకిరి’ సినిమాని చాలా మంది ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మొదటి రోజు ‘పోకిరి’ సినిమాకి కేవలం 40 శాతం ఆక్యుపెన్సీలే ఉన్నాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు. కానీ క్రమ క్రమంగా షో, షోకి కలెక్షన్స్ అమాంతం పెరుగుతూ వచ్చాయి. ‘పోకిరి’ సునామి ముందు ఏ సినిమా కూడా నిలబడలేకపోయింది.


సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఈ సినిమా. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి చాలా మంది స్టార్ హీరోస్ ట్రై చేశారు. కానీ ఎవ్వరు పోకిరి దారిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఈ సినిమా అప్పట్లోనే 40 కోట్ల పైగా షేర్ రాబట్టి సౌత్ సినిమా ఇండస్ట్రీనే ఆశ్చర్యానికి గురి చేసింది.10  కోట్లతో తీసిన ‘పోకిరి’ మూవీకి కేవలం 15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ఏకంగా 40 కోట్ల పైగా షేర్ ను 80 కోట్ల పైగా గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు అప్పట్లో ఈ సినిమా టికెట్లని బ్లాక్ లో అమ్ముకొని లక్షాధికారులు అయిన వారు కూడా ఉన్నారంటే ఈ సినిమా సృష్టించిన సంచలనాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సృష్టించిన చరిత్ర తెలుసుకొని పలు భాషల్లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమాని రీమేక్ చేశారు. బాలీవుడ్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ విజయ్, శాండిల్ వుడ్ దర్శన్ లాంటి లీడింగ్ స్టార్స్ ఈ సినిమాని రీమేక్ చేసి హిట్లు కొట్టారు కానీ ఎవ్వరు కూడా మహేష్ బాబు పెర్ఫార్మన్స్ ని, యాటిట్యూడ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఇండస్ట్రీ హిట్లు ఉన్నా కానీ పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్టు ఏ సినిమా అవ్వలేదు. పోకిరి సెలెబ్రేషన్స్, పోకిరి మ్యానియాని ఏ ఇండస్ట్రీ హిట్ సినిమా మ్యాచ్ చెయ్యలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>