PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gunturu-politics-rajini-jagan-ap-politics67c8d88a-a170-4483-bcd2-4897df8e8fcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gunturu-politics-rajini-jagan-ap-politics67c8d88a-a170-4483-bcd2-4897df8e8fcd-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌దిహేను రోజులు కూడా లేదు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కొన్ని చోట్ల అంచ‌నాలు త‌ప్పుతున్నాయి.. మ‌రి కొన్ని చోట్ల ముంద‌నుకున్న అంచ‌నాలు, మెజార్టీలు పెరుగుతున్నాయి. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ముందు హెరాహోరీప పోరు ఉంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. క‌ట్ చేస్తే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న కొద్ది విడ‌ద‌ల ర‌జ‌నీకి అనుకూలమైన వాతావ‌ర‌ణం క్లీయ‌ర్ క‌ట్‌గా క‌నిపిస్తోంది. ర‌జ‌నీ అంటేనే ఓ ఫైర్‌బ్రాండ్‌... మ‌రీ ముఖ్యంగా ఆరోగ్య శాఖా మంత్రిగా గుGUNTURU;POLITICS;RAJINI;JAGAN;AP POLITICS{#}Guntur;Y. S. Rajasekhara Reddy;Telugu Desam Party;CM;Reddy;Minister;TDPగుంటూరు పశ్చిమం: మంత్రి ర‌జ‌నీకి అనుకూలంగా మారుతోందే..?గుంటూరు పశ్చిమం: మంత్రి ర‌జ‌నీకి అనుకూలంగా మారుతోందే..?GUNTURU;POLITICS;RAJINI;JAGAN;AP POLITICS{#}Guntur;Y. S. Rajasekhara Reddy;Telugu Desam Party;CM;Reddy;Minister;TDPMon, 29 Apr 2024 18:34:11 GMTఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌దిహేను రోజులు కూడా లేదు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కొన్ని చోట్ల అంచ‌నాలు త‌ప్పుతున్నాయి.. మ‌రి కొన్ని చోట్ల ముంద‌నుకున్న అంచ‌నాలు, మెజార్టీలు పెరుగుతున్నాయి. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ముందు హెరాహోరీప పోరు ఉంటుంద‌నే అంద‌రూ అనుకున్నారు. క‌ట్ చేస్తే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న కొద్ది విడ‌ద‌ల ర‌జ‌నీకి అనుకూలమైన వాతావ‌ర‌ణం క్లీయ‌ర్ క‌ట్‌గా క‌నిపిస్తోంది.


ర‌జ‌నీ అంటేనే ఓ ఫైర్‌బ్రాండ్‌... మ‌రీ ముఖ్యంగా ఆరోగ్య శాఖా మంత్రిగా గుంటూరు జిల్లాలో, ఇటు న‌గ‌రంలో ఆమె చేసిన సేవా కార్య‌క్ర‌మాలు, ఆరోగ్య శ్రీతో మొద‌లు పెట్టి 108, 104 వాహ‌నాలు, గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్‌క్లీనిక్‌లు, ఆమె మంత్రిగా ఉన్న‌ప్పుడు మంజూరైన మెడిక‌ల్ కాలేజ్‌లు ఇవ‌న్నీ ఆమెకు ఎన‌లేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయ‌నే చెప్పాలి. సంవ‌త్స‌రాలుగా కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుల‌కే సాధ్యం కాని పనులు చేసిన ర‌జ‌నీ.. ఎంతో పేరు తెచ్చుకున్నారు.


ఇటు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీలో ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం.. అందుకు త‌గిన‌ట్టుగానే ప‌క్కా ప్లానింగ్‌తో ర‌జ‌నీ శాఖాప‌రంగా ముందుకు వెళ్ల‌డంతో ఈ రోజు ఏపీలో ఎంతోమంది పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎంతో వెసులు బాటు ల‌భించింది. గ‌తంలో తెలుగుదేశం ప్ర‌భుత్వంలో ఆమె పోటీ చేస్తోన్న గుంటూరు ఆసుప‌త్రిలో అప్పుడే పుట్టిన పాప‌ను ఎలుక‌లు కొర‌క‌డంతో మృతిచెందింది. ర‌జ‌నీ ఆరోగ్య‌శాఖా మంత్రి అయ్యాక ఒక్క గుంటూరులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌నపై ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేసి టీడీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన దారుణాల‌కు ఈ ప్ర‌భుత్వంలో చోటు లేకుండా చేశారు.


ఒక్క‌టి మాత్రం నిజం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ర‌జ‌నీ మంత్రి అయ్యాక ప్ర‌భుత్వ వైద్య సేవ‌లు పేద‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు అందే విష‌యంలో మంచి క‌నెక్టివిటి ఏర్ప‌డింది. ఇక ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో క్యాన్స‌ర్‌కు అందించే సేవ‌ల్లో కూడా ఎంతో మెరుగుద‌ల క‌నిపించిందన్న చ‌ర్చ ప్ర‌జ‌ల నుంచే ఈ నాలుగేళ్ల‌లో ఎక్కువుగా వినిపిస్తోందంటే వైద్య సేవ‌ల‌పై ప్ర‌భుత్వం, ఆ శాఖా ఎలాంటి కాన్‌సంట్రేష‌న్ చేసిందో తెలుస్తోంది.


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిపై ర‌జ‌నీ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌డంతో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు న‌గ‌రంలో ఎంతోమంది పేద‌ల‌కు చాలా ఖ‌రీదైన వైద్య సేవ‌లు ఉచితంగా అందాయి. అనుకోకుండా ఇప్పుడు ఆమె గుంటూరు నుంచే పోటీ చేస్తుండ‌డంతో దీనిపైనే పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల్లోనూ, మ‌హిళ‌ల్లోనూ బాగా చర్చ జ‌రుగుతోంది. దీనికి తోడు ఆమె వెస్ట్ ఇన్‌చార్జ్‌గా వ‌చ్చాకే ఐదారు ప్ర‌ధాన ర‌హ‌దారులు చ‌క‌చ‌కా పోసిన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు. ఇవ‌న్నీ ఈ సారి వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ర‌జ‌నీకి గెలుపులో కీల‌కం అయ్యే సూచ‌న‌లే ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>