EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమొక్కై వంగనది.. మానై వంగునా అంటారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది ఇదే. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తే ఏకు మేకై కూర్చొంది. దీని ప్రభావం ఇప్పుడు అమెరికాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా ఒక జాతి మరో జాతి అంతాన్ని కోరుకుంటుంది. దీనికి అగ్రరాజ్యం వేదిక అయింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ తీవ్ర వాదులు దాడి చేసి వందలాది మందిని కాల్చి చంపి.. మరికొందరిని బందీలుగా పట్టుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ హమాస్ పర్యవేక్షణలో ఉన్న పాలస్తీనాపై విరుచుకుపడింది. ఆరు నెలల క్రితం మొదలus{#}Colombia;California;Newyork;Israel;students;vedhika;American Samoaఅమెరికా యూనివర్శిటీల్లో అరాచకం.. ఇలా తయారయ్యిందేంటి?అమెరికా యూనివర్శిటీల్లో అరాచకం.. ఇలా తయారయ్యిందేంటి?us{#}Colombia;California;Newyork;Israel;students;vedhika;American SamoaMon, 29 Apr 2024 13:00:00 GMTమొక్కై వంగనది.. మానై వంగునా అంటారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది ఇదే. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తే ఏకు మేకై కూర్చొంది. దీని ప్రభావం ఇప్పుడు అమెరికాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా ఒక జాతి మరో జాతి అంతాన్ని కోరుకుంటుంది. దీనికి అగ్రరాజ్యం వేదిక అయింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ తీవ్ర వాదులు దాడి చేసి వందలాది మందిని కాల్చి చంపి.. మరికొందరిని బందీలుగా పట్టుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ హమాస్ పర్యవేక్షణలో ఉన్న పాలస్తీనాపై విరుచుకుపడింది.


ఆరు నెలల క్రితం మొదలు పెట్టిన ఈ యుద్దం ఇంకా ఆగలేదు. సుమారు 40 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. అయితే ఇజ్రాయెల్ కు అమెరికా అన్ని రకాల సహకారాలు అందిస్తోందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు విద్యాసంస్థల్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా ఆర్థిక, సైనిక సహకారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవాలని కోరుతున్నారు.


ఐవీ లీగ్ కొలంబియా యూనివర్శిటీలో గత వారం మొదలైన నిరసనలు అమెరికా అంతటా వ్యాపించాయి. దీంతో ఇప్పటి వరకు వందల సంఖ్యలో విద్యార్థులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా అమెరికా పోలీసులు విద్యాసంస్థల్లో ప్రవేశించరు. కానీ నిరసనలు ఎగిసిపడుతుండటంతో రంగప్రవేశం చేయక తప్పలేదు.


యూనివర్శిటీ ఆప్ టెక్సాస్, ఆస్టిన్, న్యూయార్క్ యూనివర్శిటీ, యేల్, ఒహియో స్టేట్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లో విద్యార్థులను అరెస్టు చేసింది. అయితే కొంతమంది యూదులను లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. దీంతో అమెరికా లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొంతమంది నిరసన కారులు ఇజ్రాయెల్ జాతీయ జెండాను దహనం చేశారు. హమాస్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అమెరికా చోద్యం చూస్తుండటంతో అగ్రరాజ్యం రక్తసిక్తం అవుతుందేమో అనిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>