MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6ce7c238-849d-4bec-8f20-066d8b7344f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6ce7c238-849d-4bec-8f20-066d8b7344f2-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అద్భుతమైన అందం అందానికి మించిన తన మాటలు అసలైన చిత్తూరు యాసలో ఆమె అదరగొట్టే తీరుతో ఈమెకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇక ఆమెకి తగ్గట్టుగానే తన అద్భుతమైన ఆటతీరును కనబరిచి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సెలబ్రిటీగా tollywood{#}Bangkok;Jabardasth;Bigboss;Chittoor;BEAUTY;Teluguగత 5 నెలలుగా డిప్రెషన్ లో ఉన్న గీతూ రాయల్.. ఎందుకంటే..!?గత 5 నెలలుగా డిప్రెషన్ లో ఉన్న గీతూ రాయల్.. ఎందుకంటే..!?tollywood{#}Bangkok;Jabardasth;Bigboss;Chittoor;BEAUTY;TeluguSun, 28 Apr 2024 15:55:00 GMTబిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అద్భుతమైన అందం అందానికి మించిన తన మాటలు అసలైన చిత్తూరు యాసలో ఆమె అదరగొట్టే తీరుతో ఈమెకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇక ఆమెకి తగ్గట్టుగానే తన అద్భుతమైన ఆటతీరును కనబరిచి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయింది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. గత ఐదు నెలలుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతోందట గీతు రాయల్. ఇక ఆ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లుగా ఆమె తాజాగా వెల్లడించింది. అయితే పూర్తి వివరాలు ఏంటి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. గీతా రాయల్ మాట్లాడుతూ.. తాను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నట్లు చెప్పింది.

 బొద్దింకలు, పిట్టలు వంటి అనేక రకాల ఆహార పదార్థాలను ట్రై చేసినట్లు వివరించింది. ముఖ్యంగా చనిపోయేలోపు అన్ని చూడాలి, ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా తిన్నానని.. దాని వల్లే తనకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా తాను విజయవాడకు అమ్మవారి దర్శనం కోసం అక్కడకు వెళ్లి.. దర్శించుకోలేదని, అలాగే తిరుచానూరుకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేసినట్లు వివరించింది. బిగ్ బాస్ రీవ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు కూడా వెళ్లింది. అలాగే జబర్దస్త్ వంటి షోలతో పాటు అనేక షోలలో కనిపించి తెగ సందడి చేసింది. అంతేకాదండోయ్ బిగ్ బాస్ తెలుగు 7 బిగ్ బాస్ బజ్ షోకు యాంకర్ గా కూడా చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>