PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kadapa-brother-anil-kumar-jagan-sharmila-a77e9c7f-20e5-4420-9521-e448409133bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kadapa-brother-anil-kumar-jagan-sharmila-a77e9c7f-20e5-4420-9521-e448409133bc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది పార్టీలలో, అభ్యర్థులలో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రచారాల్లో వేగం పెంచారు. రకరకాల హామీలు ఇస్తూ గెలవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు అభ్యర్థులు. ఇక వైసిపి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల అనూహ్యంగా కాంగ్రAP;Kadapa;Brother Anil Kumar;Jagan;Sharmila;{#}anil kumar singhal;dr rajasekhar;Murder.;devineni avinash;Kumaar;MP;kadapa;netizens;Wife;Sharmila;Congress;Reddy;politics;Elections;Jagan;CBN;YCPఅనిల్ కుమార్: షర్మిల భర్త పరోక్ష కామెంట్లు.. ఆయన్ని ఉద్దేశించేనా..?అనిల్ కుమార్: షర్మిల భర్త పరోక్ష కామెంట్లు.. ఆయన్ని ఉద్దేశించేనా..?AP;Kadapa;Brother Anil Kumar;Jagan;Sharmila;{#}anil kumar singhal;dr rajasekhar;Murder.;devineni avinash;Kumaar;MP;kadapa;netizens;Wife;Sharmila;Congress;Reddy;politics;Elections;Jagan;CBN;YCPSun, 28 Apr 2024 19:33:10 GMTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది పార్టీలలో, అభ్యర్థులలో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రచారాల్లో వేగం పెంచారు. రకరకాల హామీలు ఇస్తూ గెలవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు అభ్యర్థులు. ఇక వైసిపి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు  వైయస్ షర్మిల అనూహ్యంగా కాంగ్రెస్ లోకి వెళ్లి కాంగ్రెస్ తరపున కడప పార్లమెంటు సీటు నుండి పోటీ చేస్తుంది.

అయితే తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆదివారం రోజు కడపలోని రాజారెడ్డి వీధిలో పర్యటిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఎవరికి భయపడకండి.. అందరికీ ఆ ఏసు ప్రభువే అండగా ఉంటారు.. పాపులను తరిమికొట్టండి. న్యాయం కోసమే మేము పోరాడుతున్నాం. ఆ దేవుడు మీద నమ్మకం ఉంచుకొని పాపాలు చేసే వారిని తొక్కి వేయండి అంటూ బ్రదర్ అనిల్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ అనిల్ కుమార్ తన భార్య షర్మిలకు మద్దతుగా నిలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పరోక్ష కామెంట్లు చేశారని భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే కడప పార్లమెంటు స్థానం నుండి వైయస్ షర్మిల కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిపై ముకుమ్మడిగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇక షర్మిల వైసిపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా షర్మిల గెలవాలని అవినాష్ రెడ్డి తన చిన్నాన్న వివేకను హత్య చేశారని,అలాంటి నిందితులని పార్లమెంటుకి పంపకూడదని, నిందితులు పార్లమెంటుకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను..మీ అందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి అంటూ ప్రచారం చేస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>