PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/but-in-that-seat-in-godavari-it-is-the-kingdom-of-the-reds-even-if-the-parties-change-it-is-the-old-redle-contesta90a29ab-3a64-48b3-8625-29f2cda859ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/but-in-that-seat-in-godavari-it-is-the-kingdom-of-the-reds-even-if-the-parties-change-it-is-the-old-redle-contesta90a29ab-3a64-48b3-8625-29f2cda859ac-415x250-IndiaHerald.jpg- కాపు, బీసీలున్న గోదావ‌రి అన‌ప‌ర్తి రెడ్ల‌కు సంప్ర‌దాయ సీటే - వ‌రుస‌గా మూడోసారి త‌ల‌ప‌డుతోన్న స‌త్తి, న‌ల్ల‌మిల్లి - చివ‌ర్లో బీజేపీ కండువా క‌ప్పుకుని పోటీలో ఉన్న న‌ల్ల‌మిల్లి ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) తాజా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటు కూటమి నుంచి.. అటు వైసీపీ నుంచి రెండు వైపులా రెడ్డి నేతలు పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్థానాలు గ్రేటర్ రాయలసీమలో ఎక్కువగా కనిపిస్తాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Godavari ; ycp; tdp; bjp{#}Kshatriya;Prakasam;East Godavari;Uttarandhra;mandalam;krishna district;Rajahmundry;Macherla;central government;Cycle;Guntur;Telugu Desam Party;Minister;Assembly;Parliament;MLA;India;TDP;YCP;Reddy;Hanu Raghavapudi;Bharatiya Janata Partyగోదావ‌రిలో ఆ సీట్లో మాత్రం రెడ్ల రాజ్య‌మే.. పార్టీలు మారినా పాత రెడ్లే పోటీ..?గోదావ‌రిలో ఆ సీట్లో మాత్రం రెడ్ల రాజ్య‌మే.. పార్టీలు మారినా పాత రెడ్లే పోటీ..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Godavari ; ycp; tdp; bjp{#}Kshatriya;Prakasam;East Godavari;Uttarandhra;mandalam;krishna district;Rajahmundry;Macherla;central government;Cycle;Guntur;Telugu Desam Party;Minister;Assembly;Parliament;MLA;India;TDP;YCP;Reddy;Hanu Raghavapudi;Bharatiya Janata PartySun, 28 Apr 2024 10:30:57 GMT- కాపు, బీసీలున్న గోదావ‌రి అన‌ప‌ర్తి రెడ్ల‌కు సంప్ర‌దాయ సీటే
- వ‌రుస‌గా మూడోసారి త‌ల‌ప‌డుతోన్న స‌త్తి, న‌ల్ల‌మిల్లి
- చివ‌ర్లో బీజేపీ కండువా క‌ప్పుకుని పోటీలో ఉన్న న‌ల్ల‌మిల్లి

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

తాజా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటు కూటమి నుంచి.. అటు వైసీపీ నుంచి రెండు వైపులా రెడ్డి నేతలు పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్థానాలు గ్రేటర్ రాయలసీమలో ఎక్కువగా కనిపిస్తాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ కొన్ని స్థానాల్లో రెండువైపులా రెడ్డి సమావేశ వర్గానికి చెందిన నేతలే రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం చేయడం.. గత కొన్ని దశాబ్దాలుగా కామన్ గా జరుగుతూ వస్తోంది. గుంటూరులోనూ మాచర్ల లాంటి నియోజకవర్గం రెండువైపులా రెడ్డి వర్గం నేతలే పోటీ చేయటం సాంప్రదాయంగా వస్తోంది.


గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు రెండు వైపులా రెడ్డి సామాజిక వర్గం నేతలు కొన్ని దశాబ్దాలుగా పోటీ చేసే ఏకైక నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మాత్రమే. అనపర్తి నియోజకవర్గంలో రెడ్లు బాగా కేంద్రీకృతం అయి ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని దశాబ్దాలుగా అప్పట్లో కాంగ్రెస్, తెలుగుదేశం.. ఇప్పుడు వైసీపీ అయినా కూడా ఈ సీటు రెడ్డి వర్గానికే కేటాయిస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి ముందుగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎవరికీ తెలియని వ్యక్తికి సీటు ఇచ్చారు.


ఈ ప్రభావం రాజమండ్రి పార్లమెంటు సీటు పై పడి రాజమండ్రి పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి సైతం ఓడిపోతారన్న అంచనాలతో వెంటనే సీటు మార్చేశారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వెంటనే కాషాయ కండువా కప్పి ఆయనకు బీజేపీ బీఫామ్ ఇచ్చారు. అంటే గత రెండు ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన రామకృష్ణారెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక 2014, 2019 ఎన్నికలతో పాటు తాజా ఎన్నికలలో మరోసారి పాత ప్రత్య‌ర్దులే పోటీ పడుతున్నారు.


2014, 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిని ఢీ కొట్టిన.. రామకృష్ణారెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. అదొక్కటే తేడా.. మామూలుగా అయితే అనపర్తిలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. వైసీపీకి ఇక్కడ గట్టిపట్టు కనిపిస్తోంది. అయితే నియోజకవర్గంలో రంగంపేట మండలం తో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా 40 వేల వరకు ఉన్నారు. ఈ సారి పొత్తు ఉన్న నేపథ్యంలో ఇక్కడ గట్టి పోటీ తప్పేలా లేదు. అయితే రామకృష్ణారెడ్డి సైకిల్ సింబల్ పై కాకుండా బీజేపీ కమలం సింబల్ పై పోటీ చేయటంతో ఇక్కడ ఎంతవరకు గట్టి పోటీ ఉంటుంది అన్నది ఇప్పటివరకు అయితే చెప్పలేని పరిస్థితి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>