MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/faria-abdullah-dazzles-in-dubai-in-maroon-marvel-photos8e7e83e5-e9dc-45ed-825b-98fcbe555b6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/faria-abdullah-dazzles-in-dubai-in-maroon-marvel-photos8e7e83e5-e9dc-45ed-825b-98fcbe555b6d-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను , సూపర్ సక్సెస్ ను అందుకున్న అతి తక్కువ మంది ముద్దు గుమ్మలలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ పొడుగు కాళ్ళ సుందరి నవీన్ పోలిశెట్టి హీరో గా అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాfaria{#}allari naresh;naveen polishetty;cinema theater;BEAUTY;Heroine;Cinema;Mass;Interview;Industry;Telugu;Successఅలాంటి మూవీలు చేయాలని ఉంది... ఫరియా..!అలాంటి మూవీలు చేయాలని ఉంది... ఫరియా..!faria{#}allari naresh;naveen polishetty;cinema theater;BEAUTY;Heroine;Cinema;Mass;Interview;Industry;Telugu;SuccessSun, 28 Apr 2024 10:38:00 GMTప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను , సూపర్ సక్సెస్ ను అందుకున్న అతి తక్కువ మంది ముద్దు గుమ్మలలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఈ పొడుగు కాళ్ళ సుందరి నవీన్ పోలిశెట్టి హీరో గా అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

మూవీ మంచి విజయం సాధించడం , అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో జాతి రత్నాలు సినిమాతో పరియ కు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరుచుకుంది. ఇకపోతే ఈమె తాజాగా అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల దగ్గర పడిన నేపథ్యంలో ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఫరియా మాట్లాడుతూ ... సినిమాలను సెలెక్ట్ చేసుకునే విషయంలో పాత్రతో పాటు దాని ప్రాధాన్యం , నిడివి కూడా చూస్తాను అని తెలియజేసింది. మాస్ మసాలా సినిమాలు చేయాలని ఉంది అన్నారు. అలాగే ఇండస్ట్రీ లో యాక్షన్ మూవీ స్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఖాళీ ని భర్తీ చేయాలి అనుకుంటున్నట్లుగా ఈమె తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>