Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipld99a3510-7492-41a2-b611-c2522bedab7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipld99a3510-7492-41a2-b611-c2522bedab7c-415x250-IndiaHerald.jpgటీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గతంలో రోడ్డు ప్రమాదం బారిన పడి దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్ కి దూరంగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను మళ్లీ కోలుకుని ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెడతాడా లేదా అనే విషయంపై అతని అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఎంతో పట్టుదలతో తీవ్ర గాయాల నుంచి కోలుకున్న పంత్ మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త తడబాటుకు గురైనIpl{#}Akash Chopra;Mumbai;Delhi;Cricket;World Cup;Rishabh Pantఇకనైనా.. పంత్ అలా చేస్తే బెటర్ : ఆకాష్ చోప్రాఇకనైనా.. పంత్ అలా చేస్తే బెటర్ : ఆకాష్ చోప్రాIpl{#}Akash Chopra;Mumbai;Delhi;Cricket;World Cup;Rishabh PantSun, 28 Apr 2024 06:40:00 GMTటీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గతంలో రోడ్డు ప్రమాదం బారిన పడి దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్ కి దూరంగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను మళ్లీ కోలుకుని ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెడతాడా లేదా అనే విషయంపై అతని అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఎంతో పట్టుదలతో తీవ్ర గాయాల నుంచి కోలుకున్న పంత్ మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు.


 మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త తడబాటుకు గురైనప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇక రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్తో టి20 వరల్డ్ కప్ జట్టులోకి వచ్చేలాగే కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే తనకు కలిసి వచ్చిన ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే పంత్ కాస్త ముందుగా బ్యాటింగ్ చేయడానికి రావాలి అంటూ కొంతమంది మాజీ ప్లేయర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేవలం 10 పరుగుల తేడాతో మాత్రమే ఢిల్లీ విజయం సాధించింది.


 అయితే ఇదే విషయం గురించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మరింత ముందుకు రావాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ముంబైతో ఢిల్లీ ఆడిన మ్యాచ్లో ఆలస్యంగా బాటింగ్ వచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు చాలా స్వల్ప తేడాతో గెలిచింది. పంత్ ముందుగా వస్తే మ్యాచ్లను మలుపు తిప్పగలడు. చివర్లో వస్తే ప్రభావం చూపించే సమయం అతనికి దొరకడం లేదు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>