DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ycp8e9a1ce5-575c-4daa-a17a-019a491cda96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ycp8e9a1ce5-575c-4daa-a17a-019a491cda96-415x250-IndiaHerald.jpgఈవీఎంలలో తెలుగు అక్షర మాల ప్రకారం అభ్యర్థి పేరులో ఉన్న మొదటి అక్షరం ఆధారంగా వరుస క్రమం నిర్వహిస్తారు. ఈ లెక్కన ఒకే పేరున్న అభ్యర్థులు పోటీలో ఉంటే.. వారి పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి. పేరు ప్రకారం చూస్తే ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్న నామినేషన్లు వేయించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ కేఏ పాల్ రూపంలో ఈ ఎత్తుగడను వాడుకొంది. అయినా కానycp{#}krishna;GANTA SRINIVASA RAO;East;Mangalagiri;Nara Lokesh;Telugu;Cycle;Janasena;District;YCP;TDP;Party;Congressవైసీపీ వర్సెస్‌ టీడీపీ: నామినేషన్లలోనే అదిరే వ్యూహాలు?వైసీపీ వర్సెస్‌ టీడీపీ: నామినేషన్లలోనే అదిరే వ్యూహాలు?ycp{#}krishna;GANTA SRINIVASA RAO;East;Mangalagiri;Nara Lokesh;Telugu;Cycle;Janasena;District;YCP;TDP;Party;CongressSun, 28 Apr 2024 09:30:00 GMTఈవీఎంలలో తెలుగు అక్షర మాల ప్రకారం అభ్యర్థి పేరులో ఉన్న మొదటి అక్షరం ఆధారంగా వరుస క్రమం నిర్వహిస్తారు. ఈ లెక్కన ఒకే పేరున్న అభ్యర్థులు పోటీలో ఉంటే.. వారి పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి. పేరు ప్రకారం చూస్తే ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.  


దీంతో ఆయా పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్న నామినేషన్లు వేయించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ కేఏ పాల్ రూపంలో ఈ ఎత్తుగడను వాడుకొంది. అయినా కానీ ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ సారి కూడా టీడీపీ అదే ప్రయత్నం మరో మారు చేసేందుకు యత్నించగా.. వైసీపీ తిప్పికొట్టి అదే ఫార్ములాను సైకిల్ పై ప్రయోగించింది.


మంగళగిరి సీటు టీడీపీకి ఎంత ప్రతిష్ఠాత్మకమో.. వైసీపీకి కూడా అంతే. అక్కడ నారా లోకేశ్ ని మరోసారి ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇక్కడ తమ పార్టీ అభ్యర్థిగా మురుగుడు లావణ్యను బరిలో దింపారు. అయితే టీడీపీ నాయకులు మురుగుడు లావణ్య అనే అదే పేరుగల వేరే అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో పెట్టారు. దీనికి కౌంటర్ గా వైసీపీ భీమిలిలో గంటా శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా అదే పేరుగల వేరు అభ్యర్థిని బరిలో దింపింది.


అలాగే తూర్పు గోదావరి జిల్లా రాజాం నగరం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరాం కృష్ణ పోటీలో ఉంటే ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ తరఫున ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పి.గన్నవరంలో కూటమి తరఫున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉంటే.. వేట్లపాలెం గ్రామానికి చెందిన గిడ్డి సత్యనారాయణను నామినేషన్ వేయించారు. కొత్తపేట నుంచి బండారు సత్యనారాయణ ఉంటే.. నవరంగ కాంగ్రెస్ నుంచి బండారు శ్రీనివాసరావు చేత నామినేషన్ వేయించారు. ఇలా పలు చోట్ల వైసీపీ టీడీపీకి కౌంటర్ ఎటాక్ చేస్తూ కూటమి నేతలకు షాక్ ఇస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>