Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl24b8bb0f-432d-45d5-8f91-a4e7063a10cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl24b8bb0f-432d-45d5-8f91-a4e7063a10cf-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు అటు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం కంటే.. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న ప్రాంతీయ క్రికెట్లో ఆడేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు క్రికెట్లో ఆడటం కారణంగా కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉండడం.. అంతకుమించి మంచి ప్రదర్శన చేస్తే పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉండడంతో ఇక దేశం తరఫున ఆడటానికి పెద్దగా ఎవరు ఆసక్తిని చూపించడం లేదు. అంతర్జాతీ మ్యాచ్లు ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడేందుకు ముందుకు సాగుతున్నారు. కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ లాIpl{#}raja;Bangladesh;Zimbabwe;Punjab;ICC T20;Cricket;Yevaruఇప్పటికే కష్టాల్లో ఉన్న పంజాబ్ జట్టుకి.. మరో బిగ్ షాక్?ఇప్పటికే కష్టాల్లో ఉన్న పంజాబ్ జట్టుకి.. మరో బిగ్ షాక్?Ipl{#}raja;Bangladesh;Zimbabwe;Punjab;ICC T20;Cricket;YevaruSun, 28 Apr 2024 10:30:00 GMTఈ మధ్యకాలంలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు అటు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం కంటే.. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న ప్రాంతీయ క్రికెట్లో ఆడేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు  క్రికెట్లో ఆడటం కారణంగా కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉండడం.. అంతకుమించి మంచి ప్రదర్శన చేస్తే పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉండడంతో ఇక దేశం తరఫున ఆడటానికి పెద్దగా ఎవరు ఆసక్తిని చూపించడం లేదు. అంతర్జాతీ మ్యాచ్లు ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడేందుకు ముందుకు సాగుతున్నారు.


 కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఇక భారీగా ఆదాయం వస్తున్న దేశం తరఫున ఆడటానికి మొదటి ప్రాధాన్యత అని స్పష్టంగా చెబుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఒక స్టార్ ఆల్ రౌండర్ కూడా ఒక దేశం తరఫున ఆడే అవకాశం వస్తే.. ఐపిఎల్ జట్టుకే షాక్ ఇచ్చాడు  అతను ఎవరో కాదు జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రాజా. ఈ ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ జట్టు కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.


 ప్లే ఆఫ్ లో అడుగు పెట్టాలంటే తర్వాత మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది  జట్టులో ఆల్రౌండర్ గా కొనసాగుతున్న సికిందర్ రాజా ఐపీఎల్ నుంచి వైదొలిగారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ ఉండడంతో ఈ జింబాబ్వే ప్లేయర్ స్వదేశానికి వెళ్ళాడు. బంగ్లా, జింబాబ్వే మధ్య మే మూడవ తేదీ నుంచి 12వ తేదీ వరకు 5 t20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ ఆడేందుకు వెళ్లిన సికిందర్ రాజా ఈ సిరీస్ ముగిసిన వెంటనే.. మళ్ళీ పంజాబ్ జట్టుతో చేరే అవకాశం ఉంది. పంజాబ్ టీం కి ధన్యవాదాలు. ఆ టీం తో ఆడిన ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను. ఇక ఇప్పుడు దేశానికి ఆడాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ కలుద్దాం అంటూ ఒక పోస్ట్ పెట్టాడు సికిందర్ రాజా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>