MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rsce68bbd7-52ae-41aa-aa5c-36ab0ed64d89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rsce68bbd7-52ae-41aa-aa5c-36ab0ed64d89-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో విడుదల అయిన ఎన్నో కన్నడ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ లో విజయాలను అందుకున్నాయి. ఇకపోతే రీసెంట్ టైమ్ లో విడుదల అయిన కన్నడ సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ విజయాన్ని అందుకొని ప్రేక్షకులను , విమర్శకులను సైతం మెప్పించిన మూవీ లలో "777 చార్లీ" మూవీ ఒకటి. ఈ మూవీ లో రక్షిత్ శెట్టి హీరో గా నటించగా ... కిరణ్ రాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఒక వ్యక్తి కి మరియు కుక్కకు మధ్య జరిrs{#}kiran;Japan;Rakshit Shetty;June;Kannada;Indian;Box office;Cinema;Teluguఆ తేదీన జపాన్లో "777 చార్లీ" రిలీజ్..!ఆ తేదీన జపాన్లో "777 చార్లీ" రిలీజ్..!rs{#}kiran;Japan;Rakshit Shetty;June;Kannada;Indian;Box office;Cinema;TeluguSun, 28 Apr 2024 11:19:15 GMTఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో విడుదల అయిన ఎన్నో కన్నడ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ లో విజయాలను అందుకున్నాయి. ఇకపోతే రీసెంట్ టైమ్ లో విడుదల అయిన కన్నడ సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ విజయాన్ని అందుకొని ప్రేక్షకులను , విమర్శకులను సైతం మెప్పించిన మూవీ లలో "777 చార్లీ" మూవీ ఒకటి.

మూవీ లో రక్షిత్ శెట్టి హీరో గా నటించగా ... కిరణ్ రాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఒక వ్యక్తి కి మరియు కుక్కకు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా గా ముందుకు సాగుతుంది. మొదట కన్నడ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత తెలుగు లో విడుదల చేశారు. ఇక ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లో జపాన్ లో కూడా విడుదల చేయనున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జపాన్ లో కూడా ఈ మూవీ "777 చార్లీ" అనే టైటిల్ తోనే విడుదల కానుంది. ఈ మూవీ ని జపాన్ లో ఈ జూన్ 28 న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జపాన్ లో పేరు మోసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ షోచికు మూవీ వారు రిలీస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇండియన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో ... ఈ మూవీ జపాన్ లో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>