PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-lates-jagan-cm-ysrcp-tdp-chandrababu-jsp-janasena-pawankalyan-pavan-kalyan-bjp-modi67f432d3-83cb-4594-956a-fdae2c40e4c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-lates-jagan-cm-ysrcp-tdp-chandrababu-jsp-janasena-pawankalyan-pavan-kalyan-bjp-modi67f432d3-83cb-4594-956a-fdae2c40e4c0-415x250-IndiaHerald.jpgఎన్నికల వేళ మరోసారి టీడీపీకి దెబ్బ పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా వాస్తవ్యులు, టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్‌సీపీలోకి తాజాగా చేరడం జరిగింది. వైస్ జగన్ స్వయంగా ఆయనని కండువా కప్పి మరీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యనమల కృష్ణుడితో పాటుగా టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైఎస్సార్‌సీపీలో చేరడం జరిగింది. ఈ వేడుకలో కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌, తునిap politics lates jagan cm ysrcp tdp chandrababu jsp janasena pawankalyan pavan kalyan bjp modi{#}krishnudu;DADISETTI RAJA;Yanamala Ramakrishnudu;Tuni;kakinada;Shakti;Service;East Godavari;MP;MLA;Telangana Chief Minister;CBN;TDP;Jagan;CM;Reddyఏపీ: జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న యనమల!ఏపీ: జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న యనమల!ap politics lates jagan cm ysrcp tdp chandrababu jsp janasena pawankalyan pavan kalyan bjp modi{#}krishnudu;DADISETTI RAJA;Yanamala Ramakrishnudu;Tuni;kakinada;Shakti;Service;East Godavari;MP;MLA;Telangana Chief Minister;CBN;TDP;Jagan;CM;ReddySat, 27 Apr 2024 16:45:39 GMTఎన్నికల వేళ మరోసారి టీడీపీకి దెబ్బ పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా వాస్తవ్యులు, టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్‌సీపీలోకి తాజాగా చేరడం జరిగింది. వైస్ జగన్ స్వయంగా ఆయనని కండువా కప్పి మరీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యనమల కృష్ణుడితో పాటుగా టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైఎస్సార్‌సీపీలో చేరడం జరిగింది. ఈ వేడుకలో కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌, తుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు మాట్లాడుతూ, "ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు బాబుగారు మొండిచేయి చూపారు. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చి పట్టం గట్టారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని దారుణంగా మోసం చేసారు. టీడీపీలో గత 42 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కనీసం నామీద వారికి జాలి లేదు. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే చక్కటి ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. కానీ నాకు వారు ఆ అవకాశం ఇవ్వలేదు. దోపిడీ దారులకు, పెత్తం దారులకు సీట్లు ఇచ్చుకున్నారు. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు ఉన్న పాపాన లేదు" అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... "నా జీవితంలో గత 42 సంవత్సరాలగా ప్రజల‌ మధ్యనే ఉన్నాను. ఎవరేంటో నాకు తెలుసు. గత ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి చాలా ఆనందమేసింది. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా. అభివృద్ధి వీరితోనే సాధ్య పడుతుంది. సీఎం వైఎస్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నా శక్తి ఉన్నంతవరకు పటు పడతా. అదే విధంగా కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు నా వంతుగా కృషి చేస్తా" అని ఈ సందర్భంగా యనమల కృష్ణుడు తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>